Sansad Television: ఇంజనీరింగ్ చదివి మీడియాలో అనుభం ఉన్నవారికి భారీ వేతనంతో ఉద్యోగావకాశాలు

Sansad Television: ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్లార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాకి చెందిన సంసద్‌..

Sansad Television: ఇంజనీరింగ్ చదివి మీడియాలో అనుభం ఉన్నవారికి భారీ వేతనంతో ఉద్యోగావకాశాలు
Sansad Tv
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 10, 2021 | 8:01 PM

Sansad Television: ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్లార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాకి చెందిన సంసద్‌ టెలివిజన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగం లో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 39 పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగష్టు 1 లోపులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

ఉద్యోగ వివరాలు :

పోస్టులు : అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌, గ్రాఫిక్స్‌ ప్రోమో జీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్ట్‌, గ్రాఫిక్స్‌ స్కెచ్‌ ఆర్టిస్ట్‌, ప్రోమో ఎడిటర్‌, స్విచర్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌, డిజిటల్‌ హెడ్‌, సీనియర్‌ ప్రొడ్యూసర్‌, యాంకర్‌ / ప్రొడ్యూసర్‌, తదితరాలు. అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ / బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు మీడియా నైపుణ్యాలు ఉండాలి. వయస్సు : 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం : నెలకు రూ. 50,000 – 1,50,000 /- ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ-మెయిల్‌: sansadtvadvt@gmail.com

Also Read: కత్తి మహేష్ సహకారం అందించిన మినుగురులు స్క్రిప్ట్ కు ఆస్కార్ లైబ్రెరీలో పర్మినెంట్ ప్లేస్..