వీర జవాన్ల కుటుంబాలకు ఒడిశా సీఎం భారీ సాయం
భువనేశ్వర్: పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన 40 మంది వీర జవాన్లలో ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. వారి పేర్లు ప్రసన్న సాహూ, మనోజ్. అయితే వీరిద్దరి కుటుంబాలకు ఒడిశా సీఎం భారీ సాయాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలను ప్రకటించారు. అంతేకాక వారి పిల్లల చదువుల విషయాన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ముందుగా రూ. 10 లక్షలు అనుకున్నదాన్ని సీఎం రూ. 25 లక్షలకు […]
భువనేశ్వర్: పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన 40 మంది వీర జవాన్లలో ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. వారి పేర్లు ప్రసన్న సాహూ, మనోజ్. అయితే వీరిద్దరి కుటుంబాలకు ఒడిశా సీఎం భారీ సాయాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలను ప్రకటించారు. అంతేకాక వారి పిల్లల చదువుల విషయాన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ముందుగా రూ. 10 లక్షలు అనుకున్నదాన్ని సీఎం రూ. 25 లక్షలకు మార్చారు.
అందుకు కారణం ఈ ఇద్దరు జవాన్లకు సంబంధించిన గ్రామాల ప్రజలు రూ. 10 లక్షల సాయంపై విమర్శలు చేశారు. తమ అయిష్టాన్ని వ్యక్త పరిచారు. దీంతో సీఎం తన నిర్ణయాన్ని మార్చి ఎక్స్‌గ్రేషియాను పెంచారు. వీర మరణం పొందిన 40 మందిలో ఏపీ నుంచి ఎవరూ లేరు. అయినప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ. 5 లక్షలను ప్రకటించారు. దేశం కోసం ప్రానాలు విడిచిన జవాను కుటుంబాలకు అండగా తామున్నామంటూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నాయి.