Nellore Egg: త్రోబాల్‌లా విసిరికొట్టినా పగలదు.. ఉడకబెట్టాక చూస్తే వెలుగులోకి అసలు రహాస్యం.. “వింత కోడిగుడ్డు”!

ఈ గుడ్డు పగలదు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు, వందసార్లు త్రోబాల్‌లా విసిరికొట్టినా పగలదు. బండపెట్టి కొట్టి.. లోపల సొనచూస్తే సాగుతూ ఉంటుంది.

Nellore Egg: త్రోబాల్‌లా విసిరికొట్టినా పగలదు.. ఉడకబెట్టాక చూస్తే వెలుగులోకి అసలు రహాస్యం.. “వింత కోడిగుడ్డు”!
Nellore Plastic Egg
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 19, 2021 | 11:46 AM

Nellore Plastic Egg: ఈ గుడ్డు పగలదు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు, వందసార్లు త్రోబాల్‌లా విసిరికొట్టినా పగలదు. బండపెట్టి కొట్టి.. లోపల సొనచూస్తే సాగుతూ ఉంటుంది. వంద డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వంద నిమిషాలు ఉండకబెట్టినా.. గుడ్డు కాస్త కూడా ఉండకదు. ఒకవేళ పొరపాటున ఉడికిందా లోపలంతా రాయిలా మారుతుంది. పొట్టు ఒలిచినా.. చూడ్డానికి డిఫరెంట్‌గానే ఉంటుంది. కారణం ఈ గుడ్డులో ప్లాస్టిక్ ఉంది. తింటే ఇక అంతే అంటున్నారు నిపుణులు.

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అంతా ఈ ప్లాస్టిక్ గుడ్లు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో కోడిగుడ్డు ఆరు రూపాయలు. 30 గుడ్లు కావాలంటే 180 రూపాయలు. అలాంటిది అదే ముప్పై గుడ్లు వందరూపాయలకు ఇస్తాం ఎవరైనా చెబితే..? అది కూడా ఇల్లు కదలకుండా ఆటోలో డోర్‌ డెలివరి చేస్తే.. ! హ్యాపీనే కదా. అందుకే ఉదయగిరి నియోజకవర్గంలోకి వచ్చిన ఓ ఆటో వాళ్ల నుంచి కోడిగుడ్లను ఎగబడి కొన్నారు జనం. క్షణాల్లో ఆటోలు ఖాళీ అయిపోయాయి.

కొన్నాం కదాని.. ఇంటికెళ్లి చూసి నమ్మలేకపోయారు పబ్లిక్. పొరపాటున జారి కిందపడిన గుడ్డు కూడా పగలకపోవడంతో అనుమానాలు వచ్చాయి. మళ్లీ మళ్లీ విసిరి చూశారు. అయినా పగల్లేదు. ఉడకబెట్టి చూశారు.. గంటపాటు నీళ్లలో వేసి స్టవ్‌ మీద పెట్టినా.. ఉడకలేదు. కొన్నేమ్మో గట్టిగా రాళ్లలా మారిపోయాయి. పగలగొట్టి సొన ఎలా ఉందో చూశారు. అదేమో సాగుతూ ఉంది! అన్ని రకాల పరీక్షల తర్వాత జనం తేల్చింది ఏంటీ అంటే.. ఇది కోడి పెట్టిన గుడ్డు కాదని, ఈ గుడ్డులో ప్లాస్టిక్ ఉందని.. !

Yes, కరోనా నుంచి ఇమ్యూనిటీ కోసం ప్రొటీన్ ఫుడ్ కావాలంటున్నారు. గుడ్డును మించి ప్రొటీన్‌ లేదని మనకు తెలుసు. కానీ.. ప్రొటీన్‌ సంగతేమో గానీ.. సరిగ్గా చూడకపోతే పొట్టలోకి ప్లాస్టిక్ వెళ్లడం ఖాయం. చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్న ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ గుడ్లు మనం చాలా సార్లు చూశాం. అయితే.. ట్రే గుడ్లలో ఒకటో రెండో కలిపేసి కల్తీ చేసేవారు. అలాంటిది ఇప్పుడు నేరుగా ట్రేలకు ట్రేలు ప్లాస్టిక్ గుడ్లను అమ్మేశారా.. ! అసలు ఏ గుడ్డును నమ్మాలి.. ఏ గుడ్డును నమ్మొద్దు. తింటే పోతారనిపించే ప్లాస్టిక్ గుడ్లు నిజమేనా.. ! ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే ఈ తంతు సాగుతోందా.. జిల్లా, రాష్ట్రమంతా విస్తరించిందిందా! అధికారులూ స్పందించండి ప్లీజ్ అంటున్నారు నెల్లూరు వాసులు.

Read Also…  Viral Pic: కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!