India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..

India Corona: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 81 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ....

India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..
Covid-19 India news
Follow us

|

Updated on: Feb 16, 2021 | 10:22 AM

India Corona: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,121 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 81 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 1,09,25,710 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా కరోనా నుంచి 11,805 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు 1,06,33,025 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపింది. ఇక ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,55,813కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,36,872 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇప్పటి వరకు దేశంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 87,20,82కు చేరినట్లు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

కాగా, దేశంలో గతంలో కంటే ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల వల్ల కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని, అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Also Read: Night curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూ.. మెట్రో నగరాల్లో నెలాఖరు వరకు పెంచిన గుజరాత్ ప్రభుత్వం.. ఎందుకంటే..?