మీ కల.. కలలాగే మిగిలిపోతుంది: జగన్‌కు లోకేష్ ట్వీట్
ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించిన చార్జ్‌షీట్లు ఉన్నాయి. మీరు నీతి నిజాయితీ పై మాట్లాడటం ఏమీ బాగోలేదు సార్ అంటూ ట్వీట్ చేశారు. మా బాబు పై మీ బాబు 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రలను వేయాలని అడ్డదారులు తొక్కారు.. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరం కాదు అని అన్నారు. పోలవరం పై టీడీపీ పంపిన అంచనాలన్నింటికి కేంద్రం […]
ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించిన చార్జ్‌షీట్లు ఉన్నాయి. మీరు నీతి నిజాయితీ పై మాట్లాడటం ఏమీ బాగోలేదు సార్ అంటూ ట్వీట్ చేశారు. మా బాబు పై మీ బాబు 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రలను వేయాలని అడ్డదారులు తొక్కారు.. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరం కాదు అని అన్నారు. పోలవరం పై టీడీపీ పంపిన అంచనాలన్నింటికి కేంద్రం ఒకే చెప్పింది. అందరూ మీలా అవినీతిపరులే అని భావిస్తున్న మీ కల.. కలలాగే మిగిలిపోతుందని ట్వీట్ చేశారు నారా లోకేష్.
— Lokesh Nara (@naralokesh) June 27, 2019
మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్రవేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు. ఇప్పుడు మీ తరమూ కాదు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది.
— Lokesh Nara (@naralokesh) June 27, 2019
పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల…కల గానే మిగిలిపోతుంది
— Lokesh Nara (@naralokesh) June 27, 2019