యాచకుడి సంచిలో లక్షలు.. ఎన్ని..?

పాతగుంతకల్లులో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యాచకుని మృతదేహం వద్ద లక్షల్లో డబ్బులు దొరికాయి. వివరాల్లోకి వెళితే మస్తానయ్య దర్గాలో షేక్ బషీర్ అనే యాచకుడు బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దర్గా పూజారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్దకు చేరుకున్న పోలీసులు.. అతడి బ్యాగులను పరిశీలించారు. బ్యాగులో కొత్త బట్టలు, నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదును లెక్కించగా రూ. 3,23,217 ఉన్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. సుమారు పన్నేండేళ్ల నుంచి షేక్ […]

యాచకుడి సంచిలో లక్షలు.. ఎన్ని..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 27, 2019 | 1:02 PM

పాతగుంతకల్లులో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యాచకుని మృతదేహం వద్ద లక్షల్లో డబ్బులు దొరికాయి. వివరాల్లోకి వెళితే మస్తానయ్య దర్గాలో షేక్ బషీర్ అనే యాచకుడు బుధవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దర్గా పూజారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్దకు చేరుకున్న పోలీసులు.. అతడి బ్యాగులను పరిశీలించారు. బ్యాగులో కొత్త బట్టలు, నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదును లెక్కించగా రూ. 3,23,217 ఉన్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. సుమారు పన్నేండేళ్ల నుంచి షేక్ బషీర్ దర్గాలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడని ఇతడికి ఎవరూ లేరని ఆయన చెప్పారు. షేక్ బషీర్ అంత్యక్రియల కోసం రూ. 13వేలను అందజేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని ట్రైజరీలో జమచేస్తామని ఎస్‌ఐ తెలిపారు.