AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ళు చెదిరే కోట్ల డబ్బు …నిజాం వారసులకు దక్కేనా ?

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య హైదరాబాద్ నిజాం కు చెందిన కోట్లకొద్దీ సొమ్ము (సుమారు 35 మిలియన్ పౌండ్లు) కు సంబంధించిన వివాదం పీక్ స్టేజీకి చేరింది. అది 1947 లో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజన జరిగిన సమయం . రెండు దేశాలూ విడిపోయిన కాలం. ఈ సొమ్మును లండన్లోని నాట్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుకు తాము ఆయుధాలు అందజేశామని, అందువల్ల తమకే ఈ డబ్బు చెందాలని […]

కళ్ళు చెదిరే కోట్ల డబ్బు ...నిజాం వారసులకు దక్కేనా ?
Anil kumar poka
| Edited By: |

Updated on: Jun 27, 2019 | 2:26 PM

Share

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య హైదరాబాద్ నిజాం కు చెందిన కోట్లకొద్దీ సొమ్ము (సుమారు 35 మిలియన్ పౌండ్లు) కు సంబంధించిన వివాదం పీక్ స్టేజీకి చేరింది. అది 1947 లో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజన జరిగిన సమయం . రెండు దేశాలూ విడిపోయిన కాలం. ఈ సొమ్మును లండన్లోని నాట్ వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుకు తాము ఆయుధాలు అందజేశామని, అందువల్ల తమకే ఈ డబ్బు చెందాలని పాకిస్థాన్ కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే పాక్ వాదన సరికాదని, ఈ సొమ్ము తమకే చెందాలని నిజాం వారసులైన ప్రిన్స్ ముకరం జా, ఆయన తమ్ముడు ముఫక్కం జా కోర్టుకెక్కారు. 1948 లో అప్పటి హైదరాబాద్ నిజాం సుమారు 1,007,940 పౌండ్లను బ్రిటన్లోని పాక్ హైకమిషనర్ అకౌంటుకు బదిలీ చేయడంతోనే వివాదం మొదలైంది. ఆ డబ్బు ఏ ఏటికా ఏడు పెరుగుతూ వచ్చింది. కాగా-తమ తాత గిఫ్టుగా ఇచ్చిన ఈ నిధులకోసం ఎనిమిదో నిజాం, ఆయన సోదరుడు దశాబ్దాల తరబడి వేచి చూశారని, కానీ పాకిస్థాన్ 70 ఏళ్లుగా అడ్డు తగులుతోందని వారసుల తరఫు న్యాయవాది పాల్ హెవిట్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం టర్కీలో ఉన్న ఈయన .. పాకిస్థాన్ వాదన అర్థరహితమన్నారు.1947 ప్రాంతంలో ‘ భారత ఆక్రమణను తాము ఎదుర్కొన్నామని చెబుతున్న ‘ పాకిస్థాన్ కు అసలు ఈ సొమ్ము ఎలా చెందుతుందని ఆయన ప్రశ్నించారు. అటు- లండన్ కోర్టులో జస్టిస్ మార్కస్ స్మిత్ రెండువారాలుగా ఉభయ పక్షాల వాదనలను ఆలకిస్తున్నారు. స్వర్గీయ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కు చెందిన ఈ నిధులు నిజానికి ఎవరికి చెందాల్సి ఉందని ఆయన ప్రశ్నించారు. చట్టానికి లోబడి తాము తీర్పు ఇవ్వాల్సి ఉందని, కోట్ల కొద్దీ సొమ్ము విషయంలో ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా-భారతీయ కరెన్సీలో దాదాపు 309 కోట్లకు పైగా..కళ్ళు చెదిరే రీతిలో లండన్ బ్యాంకులో మూలుగుతున్న ఈ నిధుల విషయంలో భారత ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తున్నది చూడాల్సి ఉంది. పేరుకు ఇది నిజాం వారసులకు చెందాల్సి ఉన్నా.. పాకిస్తాన్ తో ఈ వ్యవహారం ముడిపడిఉన్న సంగతి గమనార్హం. . అసలే ఈ పొరుగు దేశంతో సత్సంబంధాలు అంతగా లేని ఈ తరుణంలో అక్కడి హైకమిషనర్ లండన్ కోర్టులో ఈ కేసు విచారణను ప్రభావితం చేస్తారా అన్న అంశాన్ని న్యాయ నిపుణులు లేవనెత్తుతున్నారు. పాక్-బ్రిటన్ మధ్య గల సంబంధాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..