Namrata Shirodkar : ‘ఇద్దరం..ముగ్గురైన వేళ’, మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన నమ్రత..సూపర్ వీడియో

వెండితెరకు దూరమైన ఫ్యాన్స్ కు మాత్రం టచ్‌లోనే ఉన్నారు నమ్రత. మహేష్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఫ్యామిలీ విషయాలను కూడా ఆమె ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంటారు.

Namrata Shirodkar : 'ఇద్దరం..ముగ్గురైన వేళ', మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన నమ్రత..సూపర్ వీడియో
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 18, 2020 | 1:02 PM

వెండితెరకు దూరమైన ఫ్యాన్స్ కు మాత్రం టచ్‌లోనే ఉన్నారు నమ్రత. మహేష్‌ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఫ్యామిలీ విషయాలను కూడా ఆమె ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించి మహేష్‌ ఫీలింగ్స్.. నమ్రత పేజ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. రీసెంట్‌ త్రో బ్యాక్‌ థర్స్‌డే అంటూ నమ్రత షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ’14 ఏళ్ల క్రితం ఈ చిన్నారి పుట్టాడు. ఇద్దరం.. ముగ్గురం అయిన ఆ సందర్భం ఓ రోలర్‌ కోస్టర్ రైడ్‌ లాంటింది’ అంటూ ఎమోషనల్‌ మెసేజ్‌ను షేర్ చేశారు నమ్రత. మెమరీ థెరపీ అంటూ అప్పటి జ్ఞాపకాలను మరోసారి మెమరైజ్ చేసుకున్న నమ్రత… అవే తన స్ట్రెస్ బస్టర్ అంటున్నారు.

ఇలాంటి ఎమోషనల్‌ వీడియోలనే కాదు… కొన్ని క్యాజువల్‌ వీడియోలను కూడా ఫ్యాన్స్‌ కోసం షేర్ చేస్తుంటారు ఈ స్టార్ వైఫ్‌… ఈ మధ్య నమ్రత షేర్ చేసిన మరో వీడియో కూడా తెగ వైరల్‌ అయ్యింది. తమ ఫాంలో రైస్‌తో పాటు మిర్చి, పత్తి పంటలను సాగు చేస్తున్నట్టు ఓ వీడియోను షేర్‌ చేశారు. మహర్షి లో రైతుల కోసం పోరాడిన మహేష్.. రియల్‌ లైఫ్‌లోనూ ఫామింగ్ చేస్తున్నారు.

Also Read : 

ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు