AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూ. గో. జిల్లాలో రైతుల దీక్ష, రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోన్న వైనం, పొలిటికల్‌ గేమ్‌‌గా దివిస్‌ వివాదం.!

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివిస్‌ ఎదుట రైతుల ఆందోళన రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. దివిస్‌..

తూ. గో. జిల్లాలో రైతుల దీక్ష, రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోన్న వైనం,  పొలిటికల్‌ గేమ్‌‌గా దివిస్‌ వివాదం.!
Venkata Narayana
|

Updated on: Dec 18, 2020 | 1:02 PM

Share

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివిస్‌ ఎదుట రైతుల ఆందోళన రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. దివిస్‌ కంపెనీలోకి దూసుకెళ్లేందుకు ఆందోళన కారులు యత్నిస్తుండటంతో పరిస్థితులు చేజారుతున్నాయి. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి హింసాత్మకంగా మారుతోంది. తాజాగా ఆందోళనకారులు కంటైనర్‌కు నిప్పు పెట్టారు. అలాగే జనరేటర్‌ను తగులబెట్టి గోడలను కూల్చేశారు. ఒక్కసారిగా వందల మంది ఉద్యమకారులు లోపలకు చొచ్చుకు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని భావించడంతో.. 50మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని వెంటనే విడుదల చేయాలని.. స్థానికులు అక్కడే బైఠాయించారు. ఇవీ.. అక్కడి ఘట్టాలు.

కాగా, దివిస్‌కు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా రైతులు దీక్ష చేస్తున్నారు. దివీస్ ల్యాబరేటరీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, వామపక్షలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. పరిశ్రమ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేసి తమ నిరసన తెలుపుతున్నారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణం చేపట్టవద్దంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. తూర్పుతీరంలో ఉన్న దివిస్‌ లేబరేటరీస్‌ ల్యాబ్‌.. పొలిటికల్‌ గేమ్‌కు అద్దం పడుతోంది. కొత్త యూనిట్‌ ఏర్పాటుపై అధికార, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తోంది. గతంలో ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేస్తామన్న వైసీపీ…అధికారంలోకి వచ్చాక మాట మార్చడంతో.. స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దివిస్‌ ల్యాబ్‌ను ఒప్పుకునేది లేదని మత్స్యకారులు తెగేసి చెబుతున్నారు.

Follow Us
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..