అక్టోబర్‌ 7న ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడులో ఎన్నికల వేడి పెరిగింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థి పేరును అక్టోబర్‌ 7న ప్రకటించనున్నారు. చెన్నైలోని రోయపురంలో కార్యనిర్వాహక సమావేశం సీఎం అభ్యర్థి ఎవరో తేలకుండానే ముగిసింది. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌ ఈ మధుసూదన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలు పోస్టర్లు, […]

అక్టోబర్‌ 7న ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటన
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 28, 2020 | 10:03 PM

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తమిళనాడులో ఎన్నికల వేడి పెరిగింది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున సీఎం అభ్యర్థి పేరును అక్టోబర్‌ 7న ప్రకటించనున్నారు. చెన్నైలోని రోయపురంలో కార్యనిర్వాహక సమావేశం సీఎం అభ్యర్థి ఎవరో తేలకుండానే ముగిసింది.

అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌ ఈ మధుసూదన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలు పోస్టర్లు, బ్యానర్లతో పార్టీ కార్యాలయం ఎదుట గుమిగూడారు. పళని, పన్నీర్‌సెల్వం మద్దతుదారులు పోటాపోటీగా నినాదాలు చేశారు.

కొద్ది వారాల క్రితం పన్నీర్‌సెల్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చిన సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. సమావేశం ముగిసిన అనంతరం అన్నాడీఎంకే డిప్యూటీ కో ఆర్డినేటర్‌ కేపీ మునుస్వామి మాట్లాడుతూ పన్నీర్‌సెల్వం, పళనిస్వామి కలిసి అక్టోబర్‌ 7న సీఎం అభ్యర్థి పేరును ప్రకటిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో 15 తీర్మానాలను ఆమోదించారు. వీటిలో త్రిభాషా విధానానికి అన్నాడీఎంకే వ్యతిరేకమని పేర్కొనే తీర్మానం కూడా ఉంది. నీట్‌ రద్దు, జీఎస్‌టీ బకాయిలు, కొవిడ్‌ 19 కట్టడికి మరిన్ని నిధులు కేటాయించాలనే తీర్మానాలు ఉన్నాయి.