కేసీఆర్ తీరుపై రోజా షాకింగ్ కామెంట్స్!

టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్‌లో వీలనం చేయడంతో పాటుగా పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అంతేకాక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని.. వారి స్థానంలో త్వరలోనే కొత్తవారిని తీసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తెలంగాణ సీఎం […]

కేసీఆర్ తీరుపై రోజా షాకింగ్ కామెంట్స్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2019 | 6:42 AM

టీఎస్ఆర్టీసీని గవర్నమెంట్‌లో వీలనం చేయడంతో పాటుగా పలు డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె రోజురోజుకి ఉద్రిక్తంగా మారుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అంతేకాక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని.. వారి స్థానంలో త్వరలోనే కొత్తవారిని తీసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై నగరి ఎమ్మెల్యే రోజా కాస్త ఘాటుగానే స్పందించారు.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవర్తించిన తీరుపై తీవ్రంగా స్పందించిన రోజా.. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. తమ డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ ఎలాంటి చర్చలు జరపకుండా నిర్ధాక్షణ్యంగా ఉద్యోగాల్లో నుంచి తీసేశారని వ్యాఖ్యానించారు. కానీ ఏపీలో మాత్రం ఎలాంటి ఉద్యమం లేకుండా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారన్నారు.  ఎన్నికల సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన మాటను నిలబెట్టుకొని.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న రోజా తెలంగాణలో సమ్మెతో పాటు తాజా పరిణమాలపై స్పందించారు. కాగా, ఎమ్మెల్యే రోజా కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించాయి.