వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చింది.. నవమాసాలు మోసి 6 లక్షలకు అమ్మకానికి పెట్టింది..
ప్రేమిస్తానని వెంట పడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. శారీరకంగా లోబరుచుకున్నాడు.. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.. అనంతరం.. ఆమె నమ్ముకున్న ప్రియుడు వదిలి వెళ్ళిపోయాడు. అయితే, కొన్నాళ్లకు ఆమె పండంటి బాబుకి జన్మనిచ్చింది.. కానీ, పోషించే స్థోమత లేక.. ఆమె బాబును అమ్మేందుకు సిద్దమైంది.

ప్రేమిస్తానని వెంట పడ్డాడు.. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. శారీరకంగా లోబరుచుకున్నాడు.. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.. అనంతరం.. ఆమె నమ్ముకున్న ప్రియుడు వదిలి వెళ్ళిపోయాడు. అయితే, కొన్నాళ్లకు ఆమె పండంటి బాబుకి జన్మనిచ్చింది.. కానీ, పోషించే స్థోమత లేక.. 7 రోజుల బాబును ఆమె అమ్మేందుకు సిద్దమైంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. కొనుగోలుదారులతోపాటు.. మధ్యవర్తులను అరెస్ట్ చేశారు. శిశువిక్రయం ఘటన కరీంనగర్‌లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 16 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వైజాగ్ భీమిలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. భర్తతో విడిపోయి హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివాసం ఉంటుంది.. ఇక్క ఓ వ్యక్తితో కలిసి ఉంటూ.. అక్కడ ఓ బేబీకేర్ సెంటర్‌లో పనిచేస్తోంది. అతడితో కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించింది. ఫలితంగా గర్భం దాల్చింది. ఈనెల 14న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ పండండి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాలుడిని పోషించలేక ఆ బాబును విక్రయించేందుకు కరీంనగర్ కు చెందిన కొందరిని ఆశ్రయించింది.. దీంతో వారు రంగంలోకి దిగి బాబును అమ్మకానికి పెట్టారు.
ఈ మేరకు కరీంగనర్ జిల్లాలోని గన్నేరువరం మండలం చాకలివాని పల్లికి చెందిన రాయమల్లు-లత దంపతులకు పిల్లలకు లేకపోవడంతో బాబును కొనుక్కోవాలనుకున్నారు. ఇందుకోసం కొంతమంది మద్యవర్తిత్వంతో సుమారు 6 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై తమకు డయల్ 100, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ 1098 ద్వారా అందిన సమాచారం మేరకు కరీంనగర్ బైపాస్ రోడ్డులో బాబును కొనుగోలు చేసిన వారిని, అమ్మిన వారిని, మధ్యవర్తిత్వం వహించిన వారిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
ఈ ఘటనలో పోలీసులు 6 లక్షలుగా చెబుతున్నప్పటికీ.. అంతకు మించి నగదు లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ లావాదేవీల పంపకాల్లో వచ్చిన విబేధాలతోనే కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విక్రయ ఘటననను చేధించిన పోలీసులు బాబును మహిళాశిశు సంక్షేమశాఖకు అప్పగించగా.. వైద్య పరీక్షల కోసం కరీంనగర్ జిల్లా అస్పత్రికి తరలించారు. ఎవైరనా పిల్లలను పెంచుకోవాలనుకుంటే చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని.. ఇలాంటి ఇల్లీగల్ క్రయవిక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సృజన్ రెడ్డి హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




