AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ రోజునే పంచాయతీ షెడ్యూల్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం..

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్‌ సర్వం సిద్ధం చేస్తోంది. వీలైనంత త్వరంగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు క్యాబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.

Telangana: ఆ రోజునే పంచాయతీ షెడ్యూల్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం..
Telangana Panchayat Elections
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2025 | 8:30 AM

Share

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్‌ సర్వం సిద్ధం చేస్తోంది. వీలైనంత త్వరంగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌ నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు క్యాబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. డెడికేషన్ కమీషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ముందుకెళ్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈనెల 25న జరిగే కేబినెట్ మీటింగ్‌కు ముందే రిజర్వేషన్ల జీవో ఇవ్వనుంది ప్రభుత్వం. దీని కోసం పూర్తి స్థాయిలో కసరత్తులు చేశారు మంత్రులు. అలాగే మహిళలకు రిజర్వ్డ్ చేసిన స్థానాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. లోకల్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీలను కేబినెట్ జరిగే నాటికి ప్రభుత్వం పూర్తి చేయనుంది. అనుకున్న ప్రకారం అన్ని కలిసొస్తే.. ఈనెల 26న లేదా 27 వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు..

మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి రెండవ వారం లోగా లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పంచాయితీ ఎన్నికల్లోను జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఫలితాలు రీపీట్‌ అయ్యేలా ప్లాన్ చేసుకుంటుంది ప్రభుత్వం. ఇందు కోసం అనుహ్యంగా గ్రామ పంచాయితీ ఎన్నికలకు ముందే కొత్త డీసీసీల నియామకం చేపట్టింది కాంగ్రెస్. కొత్త డీసీసీల ఆధ్వర్యంలో క్యాడర్‌ను మరింత ఉత్తేజం చేస్తూ మంచి ఫలితాలను రాబట్టాలని యోచిస్తోంది కాంగ్రెస్‌.

జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ అధికారుల పనితీరుపై రిపోర్ట్

పంచాయతీ ఎన్నికలకు ముందే అన్నివిధాలా ప్రణాళికలు రచిస్తోంది రేవంత్‌ సర్కార్‌. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారుల పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకుంది సర్కార్‌. ఈరిపోర్ట్‌పై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పలువురు సీనియర్ IASలకు స్థాన చలనం ఉండబోతుంది. ఏ క్షణమైనా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 32 మంది IPSలతో పాటు.. 9 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. కలెక్టర్ల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న సీఎం.. 4 జిల్లాలకు కొత్తకలెక్టర్లను నియమించనున్నారు. మొత్తానికి మరికొద్దిరోజుల్లో తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల సమరానికి ముందు జరుగుతున్న అనుహ్య పరిణామాలు పొలిటికల్ హీట్‌ పుట్టిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us