AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హమ్మయ్య… ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!

వరంగల్ ను షేక్ చేసిన చైన్ స్నాచర్లు దొరికిపోయారు.. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డ ఆ ముఠా నెల రోజుల పాటు... ఓరుగల్లు మహిళలు, పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది.. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు ఆ కేటుగాళ్ళను ఎట్టకేలకు పట్టేశారు..ఆ కేటుగాళ్లు తమిళనాడుకు చెందిన ముఠా గా గుర్తించిన పోలీసులు మహిళల మెడలో నుండి తెంచుకుపోయిన తాళిబొట్లు రికవరీ చేశారు.. ఆ చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్టు చేయడంతో ఓరుగల్లు మహిళలు కాస్త రిలాక్స్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న ఓరుగల్లు మహిళలు.. ఆ ఇద్దరు దొరికారు!
Chain Snatching Gang Busted
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 7:20 PM

Share

ఓరుగల్లులో వరుస చైన్ స్నాచింగ్‌లతో భయాందోళనకు గురిచేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టు చేశారు. గత నెల రోజులుగా వరంగల్ నగర మహిళలను, పోలీసులను కంటిమీద కునుకు లేకుండా చేసిన చైన్ స్నాచింగ్ ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల రోజుల వ్యవధిలో వరంగల్ నగరంలో నాలుగు చైన్ స్నాచింగ్స్ జరిగాయి.. ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన కేటుగాళ్లు తాళిబొట్లు తెంచుకు పోయారు..ఆ చైన్ స్నాచర్లు పోలీసులు, మహిళలకు కంటిమీద కునుకులేకుండా చేశారు.. బాధిత మహిళల పిర్యాదు మేరకు సుబేదారి, హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.. ఆ చైన్ స్నాచర్లకోసం విస్తృతంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టేశారు. ఆ ఇద్దరు దొంగలు తమిళనాడుకు చెందినవారుగా గుర్తించి అరెస్ట్ చేశారు.

అరెస్టయిన చైన్ స్నాచర్లు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.. వారిలో 1)కళ్యాణ సుందరం,(30) మదురై. 2) సెల్వరాజ్ (28) మధురై, కి చెందిన వారుఉన్నారు. అరెస్టయిన నిందితుల నుండి పోలీసులు 15 లక్షల 20 వేల రూపాయల విలువగల 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్వి చక్ర వాహనం, రెండు సెల్ ఫోన్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాన నిందితుడు కళ్యాణ సుందరం పూల వ్యాపారం నిర్వహిస్తుండేవాడు.. పూల వ్యాపారంతో వచ్చిన ఆదాయం అతని జల్సాలకు చాలడం లేదు.. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసగా మారడంతో గంజాయి విక్రయాలకు పాల్పడేవాడు, మొదటిసారి సెల్ఫోన్ చోరీ కీ పాల్పడటంతో పాటు తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడటంతో నిందితుడు సుందరంను పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

జైలు నుండి విడుదలైన నిందితుడు కొద్ది రోజులు సెల్ ఫోన్స్ దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేశాడు..ఆ సమయంలో మరో నిందితుడు సెల్వరాజ్ తో పరిచయం అయింది. వీరి ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో, ఇరువురు కలిసి సులభంగా డబ్బు సంపాదించాలంటే చైన్ స్నాచింగ్స్ ఒక్కటే మార్గమని భావించారు..ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలలో బంగారు పుస్తెల తాళ్లు తెంచుకుపోయారు.

గత నెలలో వరంగల్ కు చేరుకున్న ఈ ముఠా మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని చోరీచేసి, దానిపై ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, హన్మకొండ, కెయుసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ మూడవ పట్టణంలో మరో చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు.. ఈ చైన్ స్నాచర్లు అరెస్ట్ అవడంతో పోలీసులు, వరంగల్ మహిళలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us