సీఎం జగన్‌కు బాలయ్య లేఖ

హిందూపురం ఎమ్మెల్యే బాలక‌ృష్ణ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇన్ని రోజులవుతున్నా రైతులకు అవసరమైన విత్తనాలు అందింలేదని, వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆలేఖలో ఆరోపించారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు బాలకృష్ణ. సరైన ఏజెన్సీలకు విత్తన సరఫరాలను ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆయన తెలిపారు. దీనివల్ల రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, రైతులకు విత్తనాలు అందించకుండా అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఆగ్రహం వ్యక్తం […]

సీఎం జగన్‌కు బాలయ్య లేఖ
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 5:44 PM

హిందూపురం ఎమ్మెల్యే బాలక‌ృష్ణ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇన్ని రోజులవుతున్నా రైతులకు అవసరమైన విత్తనాలు అందింలేదని, వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని ఆలేఖలో ఆరోపించారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు బాలకృష్ణ.

సరైన ఏజెన్సీలకు విత్తన సరఫరాలను ఇవ్వకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆయన తెలిపారు. దీనివల్ల రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, రైతులకు విత్తనాలు అందించకుండా అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పల్లెల్లో కరెంటు కోతల పెరిగిపోయాయని ఆరోపించారు. గత ప్రభుత్వం హాయాంలో ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా 24 గంటల కరెంటు సరఫరా జరిగిందని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు పెరిగిపోయాయని తన లేఖలో పేర్కొన్నారు బాలకృష్ణ.

ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటించారు. ఆయన స్ధానిక టీడీపీ నేతలతో మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోవడంతో మైక్ కట్ అయ్యింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ తాజాగా సీఎం జగన్‌కు రాసిన లేఖలో విద్యుత్ కోతల అంశాన్ని నొక్కి చెప్పారు.