‘ఓ బేబీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్… గెస్ట్‌లుగా వెంకటేష్, రానా
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. 20 ఏళ్ల యువతి శరీరంలోకి 70 సంవత్సరాల బామ్మ ఆత్మ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది. ఆ యువతితో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ […]

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో లేడి డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. ఈ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
20 ఏళ్ల యువతి శరీరంలోకి 70 సంవత్సరాల బామ్మ ఆత్మ ప్రవేశిస్తే ఏం జరుగుతుంది. ఆ యువతితో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌లుగా వెంకటేష్, రానాలు రానున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి . సమంతాతో పాటు నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, తేజ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.