Masood Azhar: గ్రే లిస్ట్ నుంచి సైడయ్యేందుకు పాక్ ప్లాన్..మసూదే టార్గెట్‌గా భారత్ వ్యూహం..
Masood Azhar : జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో పాకిస్థాన్‌కు బుద్ది చెప్పేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మసూద్ తమ దేశంలో లేడని గతంలో చాలాసార్లు ఎఫ్ఏటీఎఫ్ మీటింగ్‌లో చెప్తూ వస్తోంది పాక్. తాజాగా ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పారిస్‌లో ఆదివారం ప్రారంభమైంది. కాగా పాకిస్థాన్‌కు చెందిన పలు అంశాలపై శుక్రవారం ఈ మీటింగ్‌లో చర్చ జరగనుంది. ప్రజంట్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్..ఆ ముద్ర తొలగించుకోనుందుకు.. తమకు […]
Masood Azhar : జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో పాకిస్థాన్‌కు బుద్ది చెప్పేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మసూద్ తమ దేశంలో లేడని గతంలో చాలాసార్లు ఎఫ్ఏటీఎఫ్ మీటింగ్‌లో చెప్తూ వస్తోంది పాక్. తాజాగా ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ పారిస్‌లో ఆదివారం ప్రారంభమైంది. కాగా పాకిస్థాన్‌కు చెందిన పలు అంశాలపై శుక్రవారం ఈ మీటింగ్‌లో చర్చ జరగనుంది. ప్రజంట్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్..ఆ ముద్ర తొలగించుకోనుందుకు.. తమకు అనుకూలంగా 12 కంట్రీలు మాట్లాడతాయని ఆశలు పెట్టుకుంది.
టెర్రరిజం విషయంలో ఎఫ్ఏటీఎఫ్ 27 అంశాలను ప్రతిపాదించింది. వీటిలో ఇంకా 13 విభాగాల్లో పాక్ వెనుకబడి ఉంది. పోయినసారి బీజింగ్‌లో జరిగిన సమావేశాల్లో ఉగ్రవాదం విషయంలో పాక్ తీసుకుంటోన్న 14 అంశాలపై ఎఫ్ఏటీఎఫ్ సంతృప్తి వ్యక్తపరిచింది. అయితే అప్పుడు మసూద్ అజార్ తమ దేశంలో లేడని పేర్కుంటూ..అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయట్లేదని నివేదిక సమర్పించింది. పోయిన సంవత్సరం పుల్వామా దాడి జరిగినప్పడు ప్రపంచ దేశాలు పాక్ దోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పాక్ డిఫెన్స్‌లో పడింది. జైషే మహ్మద్ సహా అన్ని తీవ్రవాద సంస్థలపై వెంటనే యాక్షన్ తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే మసూద్ సోదరుడు అబ్దుర్ రౌఫ్, అనుచరుడు హద్ అజార్ సహా పలువుర్ని అదుపులోకి తీసుకుని..వారికి సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. 2016 నుంచి మసూద్ పాకిస్థాన్‌లో ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నా..అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఆ దేశం. ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో అతడికి ఇటీవలే పాకిస్థాన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థానే మసూద్‌ను దాస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2019 మార్చి అతడి ఆచూకి దొరకడం లేదని అక్కడి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పడు కనుక అజార్ పాక్‌లోనే ఉన్నట్టు భారత్ ఆదారాలు చూపగలిగితే..ఎఫ్ఏటీఎఫ్ మీటింగ్‌లో పాక్ ఇరుక్కపోవడం ఖాయంగా కనిపిస్తోంది.