AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలని, ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన.. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం లోని తమ పార్టీ మంత్రులతోను, పార్టీ నేతలతోనూ సోమవారం సమావేశమవుతున్నారు. శాంతి భద్రతల […]

మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 17, 2020 | 11:39 AM

Share

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలని, ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన.. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం లోని తమ పార్టీ మంత్రులతోను, పార్టీ నేతలతోనూ సోమవారం సమావేశమవుతున్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఒక రాష్ట్ర హక్కులను కేంద్ర పరిధిలోకి జొప్పించడం సరికాదని ఆయన భావిస్తున్నారు. అలాగే జాతీయ జనాభా గణన (ఎన్ పీ ఆర్) ప్రక్రియను మే 1 నుంచి అమలు చేయాలని  ఉధ్ధవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎన్సీపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్.. ఇలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 75 రోజుల ఉధ్ధవ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఎన్సీపీలు ‘దెబ్బ కొట్టే’ యత్నంలో ఉన్నాయా అని భావిస్తున్నారు. సీఏఏ, జాతీయ జనాభా గణన చట్టాలను ఈ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రెండో చట్టం అమలును ఆపివేయాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత జనవరిలోనే ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఎల్గార్ పరిషద్ కేసు 2017 నాటిది.. నాడు జనవరి 1 న భీమా-కోరేగావ్ కేసుతో ఇది ముడిపడి ఉంది. ఆ నాడు దళితులపై అగ్రవర్ణాల దాడులు, అనంతరం పౌర హక్కుల సంఘాల నేతల అరెస్టులు దేశంలో సంచలనం రేపాయి. వరవరరావు వంటి నేతలను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం విధించారు.