కరోనా రోగులకు ప్రాచీన ‘ఆయుర్వేద చికిత్స’.. మూలికా వైద్యంతో శ్రీకారం

చైనాలోని వూహాన్ సిటీలో కరోనా (కోవిడ్-19) వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు సాధారణ అలోపతి మందులతో బాటు ప్రాచీన చికిత్సా విధానంలో వాడే మందులను కూడా ఇస్తున్నారు. 2 వేల సంవత్సరాల నాటి హెర్బల్ మెడిసిన్ (మూలికా మందు) ను వీరు పేషంట్లకు ఇవ్వడం ప్రారంభించారు. ‘లియాన్ జియావో’ అనే ఎండిపోయిన పండు నుంచి తయారు చేసిన మూలికా ఔషధాన్ని ఇస్తున్నట్టు అక్కడి ఆసుపత్రి అధికారులు తెలిపారు. చైనీస్ క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. రెండు వేల […]

కరోనా రోగులకు ప్రాచీన 'ఆయుర్వేద చికిత్స'.. మూలికా వైద్యంతో శ్రీకారం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2020 | 12:39 PM

చైనాలోని వూహాన్ సిటీలో కరోనా (కోవిడ్-19) వ్యాధిగ్రస్తులకు డాక్టర్లు సాధారణ అలోపతి మందులతో బాటు ప్రాచీన చికిత్సా విధానంలో వాడే మందులను కూడా ఇస్తున్నారు. 2 వేల సంవత్సరాల నాటి హెర్బల్ మెడిసిన్ (మూలికా మందు) ను వీరు పేషంట్లకు ఇవ్వడం ప్రారంభించారు. ‘లియాన్ జియావో’ అనే ఎండిపోయిన పండు నుంచి తయారు చేసిన మూలికా ఔషధాన్ని ఇస్తున్నట్టు అక్కడి ఆసుపత్రి అధికారులు తెలిపారు. చైనీస్ క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. రెండు వేల సంవత్సరాల నాడే ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఈ డ్రైడ్ ఫ్రూట్ ని వాడేవారట.. ప్రస్తుతం సుమారు 400 మంది రోగులకు వూహాన్ లోని  ఆసుపత్రి వైద్యులు ప్రయోగాత్మకంగా ఈ మందును ఇస్తున్నారని, ఇది పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోందని హుబె ప్రావిన్స్ లోని హెల్త్ కమిషన్ వెల్లడించింది. అలాగే యుఎస్ బయో టెక్ కంపెనీ ‘గిల్లీడ్ సైన్సెస్’ తయారు చేసిన ‘రెమ్ డెసివిల్’ అనే కొత్త మందును కూడా ఇస్తున్నట్టు ఈ కమిషన్ పేర్కొంది. అయితే ప్రాచీన మందులను ఇస్తున్నప్పుడు వాటి నాణ్యత పట్ల జాగరూకత వహించాలని వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. వీటి విశ్వసనీయతపై అధ్యయనం జరగాలని ఆమె సూచించారు. వీటిని  శాస్త్రీయంగా పరీక్షించవలసి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

కాగా-కరోనాకు గురై మరణించినవారి సంఖ్య 1600 కు పెరిగింది. చైనాలో తాజాగా 69 వేల కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్,  ఫ్రాన్స్ దేశాలలో కొత్త కేసులు బయట పడుతున్నాయి.   సుమారు 30 దేశాల్లో 780 ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్టు అంచనా.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో