AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు అలిగిన మన్మోహన్… రాజీనామాకు రెడీ….అడ్డు పడిన ఆహ్లువాలియా

మిస్టర్ కూల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అలిగి రాజీనామాకు సిధ్ధపడ్డారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ జీవోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చించి వేయడమే ఆయన ఆగ్రహానికి కారణమైందట. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 సంవత్సరం. అప్పట్లో అవినీతి ఆరోపణల మచ్ఛపడిన ఎంపీలకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు నేపథ్యంలో.. నాటి ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును తెచ్చింది. అయితే వివాదాస్పదమైన ఈ ఆర్డినెన్స్ పూర్తి అర్థరహితమైనదని, చించి.. […]

నాడు అలిగిన మన్మోహన్... రాజీనామాకు రెడీ....అడ్డు పడిన ఆహ్లువాలియా
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 17, 2020 | 2:16 PM

Share

మిస్టర్ కూల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అలిగి రాజీనామాకు సిధ్ధపడ్డారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ జీవోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చించి వేయడమే ఆయన ఆగ్రహానికి కారణమైందట. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 సంవత్సరం. అప్పట్లో అవినీతి ఆరోపణల మచ్ఛపడిన ఎంపీలకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు నేపథ్యంలో.. నాటి ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును తెచ్చింది. అయితే వివాదాస్పదమైన ఈ ఆర్డినెన్స్ పూర్తి అర్థరహితమైనదని, చించి.. పారవేయదగినదని రాహుల్ అభివర్ణించారట. దీనివల్ల తమ ప్రభుత్వం ఇరకాట పరిస్థితినెదుర్కొనవచ్ఛునని  భావించి  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట.  ఆ సమయానికి మన్మోహన్ సింగ్ అమెరికాలో ఉన్నారు. ఒకప్పటి ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం) ఉపాధ్యక్షుడైన మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా ఈ విషయాలన్నీ తన  పుస్తకంలో రాశారు. ‘బ్యాక్ స్టేజ్.. ది స్టోరీ.. బిహైండ్ ఇండియాస్ హై  గ్రోత్ ఇయర్స్’ అనే పుస్తకమిది ! నాడు మన్మోహన్ తో బాటు న్యూయార్క్ వెళ్లిన ప్రతినిధి బృందంలో తానూ  ఉన్నానని, అక్కడ ఉండగా తన సోదరుడు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన సంజీవ్…. మన్మోహన్ ను విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్ ను తనకు ఈ-మెయిల్ చేయగా ..దాన్ని మన్మోహన్ కు చూపానని ఆహ్లువాలియా తెలిపారు. ఇది చదివిన మన్మోహన్ రాజీనామాకు సిధ్ధపడ్డారని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ జీవోను చించివేయాలని అన్నారంటే అది ప్రధానమంత్రి కార్యాలయాన్ని అవమానించడమేనని.. అంటే తనను అవమానించినట్టేనని మన్మోహన్ భావించారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆలోచన మంచిది కాదని తాను సలహా ఇచ్చానని, దీంతో ఆయన వెనక్కి తగ్గారని ఆహ్లువాలియా వివరించారు. మన్మోహన్ సింగ్ తిరిగి ఢిల్లీకి వఛ్చిన అనంతరం ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

యూపీఏ-2 హయాంలో పలువురు మంత్రులపై వఛ్చిన అవినీతి ఆరోపణల గురించి, పాలసీ వైఫల్యాల గురించి ఆహ్లువాలియా ఈ బుక్ లో పేర్కొన్నారు. నాటి పలు  ప్రభుత్వ పథకాలు ఈయన వల్లే పాపులర్ అవుతూ వచ్చాయి.

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..