Sonam Kapoor: ఇదో మూర్ఖపు ప్రకటన.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై సోనమ్ ఫైర్..!

విద్యావంతులు, సంపన్నులే ఎక్కువగా విడాకులవైపు మొగ్గుచూపుతున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మండిపడ్డారు. తెలివిగల వ్యక్తులు ఎవ్వరూ ఇలా మాట్లాడరని.. ఇదొక మూర్ఖపు ప్రకటన అంటూ సోనమ్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. కాగా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్.. ఈ రోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అర్థం పర్థం లేని విషయాల కోసం విడాకుల వరకు వెళ్తున్నారు. ముఖ్యంగా […]

Sonam Kapoor: ఇదో మూర్ఖపు ప్రకటన.. ఆర్ఎస్ఎస్ చీఫ్‌పై సోనమ్ ఫైర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 12:33 PM

విద్యావంతులు, సంపన్నులే ఎక్కువగా విడాకులవైపు మొగ్గుచూపుతున్నారంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ మండిపడ్డారు. తెలివిగల వ్యక్తులు ఎవ్వరూ ఇలా మాట్లాడరని.. ఇదొక మూర్ఖపు ప్రకటన అంటూ సోనమ్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

కాగా ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్.. ఈ రోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అర్థం పర్థం లేని విషయాల కోసం విడాకుల వరకు వెళ్తున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారు, సంపన్నులే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో వచ్చిన పొగరుతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో అంతరాలు పెరిగిపోతున్నాయి అని అన్నారు. దీనిపై సోనమ్ మండిపడ్డారు.