మహారాష్ట్రలో కొత్తగా 10244 మంది కరోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుండగా, మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతుంది.

మహారాష్ట్రలో కొత్తగా 10244 మంది కరోనా పాజిటివ్
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 05, 2020 | 9:00 PM

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుండగా, మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత మరింతగా పెరుగుతుంది. ప్రతిరోజు పది వేలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండు వందలకుపైగా మరణాలు నమోదుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,244 కరోనా కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది. కాగా, ఇవాళ ఒక్కరోజే 263 మంది మరణించారు. దీంతో ఆ రాష్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,53,653కు, మరణాల సంఖ్య 38,347కు పెరిగింది. గత 24 గంటల్లో 12,982 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 11,62,585 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 2,52,277 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది.