పవన్ కళ్యాణ్‌తో కన్నడ హీరో సమావేశం.. ఆ అంశంపైనే చర్చ
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కలిశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన సుదీప్.. పవన్ కళ్యాణ్‌కు మొక్కను అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు.
Pawan Kalyan : ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కలిశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన సుదీప్.. పవన్ కళ్యాణ్‌కు మొక్కను అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. సినిమాలకు సంబంధించిన అంశంతోపాటు ప్రస్తుతం నెలకొన్న పరిస్తితులు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతేడాది సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 చిత్రంలో సుదీప్ విలన్‌గా కనిపించి మెప్పించారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్షన్‌లో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమాతోపాటు మరో సినిమాకు కూడా ఓకే చెప్పారు.
జనసేనాని శ్రీ @PawanKalyan గారితో ప్రముఖ నటుడు @KicchaSudeep భేటీ. ఈరోజు హైదరాబాద్ లోని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి విచ్చేసిన సుదీప్ గారు, వర్తమాన అంశాలు, అన్ లాక్ ప్రక్రియ నేపథ్యంలో నూతన షూటింగ్ నిబంధనల గురించి చర్చించి, జనసేనానికి మొక్కలను బహూకరించారు. pic.twitter.com/zEEqOWLhj8
— JanaSena Party (@JanaSenaParty) October 5, 2020