దేశవ్యాప్తంగా నేడు వ్యాపారుల బంద్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సోమవారం వ్యాపారులు బంద్‌కు పిలునిచ్చారు. పుల్లవామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య(సీఏఐటీ) ఈ పిలుపునిచ్చింది. సోమవారం వాణిజ్య సదుపాయాలన్నీ మూతపడుతాయని, వ్యాపార కార్యకలాపాలేవీ కొనసాగవని సీఏఐటీ తెలిపింది. బంద్ సందర్భంగా సోమవారం వ్యాపారులు ఉపవాసం ఉంటారని.. ఆయా రాష్ట్రాల్లో అమరవీరులకు నివాళిగా ఊరేగింపులో పాల్గొంటారని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ చెప్పారు.