5

మళ్లీ ‘ఉఫ్’మనిపించిన రజనీ

చెన్నై: తన అభిమానులు మరోసారి ‘ఉఫ్’ అనేలా ప్రకటన చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏడాది క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించిన రజనీ.. రజనీ మక్కల్ మంద్రమ్ అనే వేదికను ఏర్పాటు చేసి మద్దతుదారులు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని వారందరూ అనుకున్నారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు రజనీ. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం […]

మళ్లీ ‘ఉఫ్’మనిపించిన రజనీ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:53 PM

చెన్నై: తన అభిమానులు మరోసారి ‘ఉఫ్’ అనేలా ప్రకటన చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏడాది క్రితం రాజకీయాల్లోకి ప్రవేశించిన రజనీ.. రజనీ మక్కల్ మంద్రమ్ అనే వేదికను ఏర్పాటు చేసి మద్దతుదారులు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారని వారందరూ అనుకున్నారు. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు రజనీ. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. మన లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే’’ అంటూ రజనీ ప్రకటించారు.

తాను ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు. ప్రచార సమయంలో నా ఫొటో గానీ, సంస్థ జెండాను గానీ ఎవరూ వాడొద్దు. తమిళనాడు నీటి సంక్షోభాన్ని ఏ పార్టీ శాశ్వతంగా పరిష్కరిస్తుందని భావిస్తున్నారో దానికే ఓటు వేయండి అంటూ రజనీ కాంత్ తెలిపారు. ఆదివారం జిల్లా కార్యదర్శులతో జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్ ఈ మేరకు చెప్పారు. 2020 ఆగష్టు నెలలో పార్టీని ఏర్పాటుచేద్దామని, ఆ తరువాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని రజనీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని రజనీ చెప్పడంపై అభిమానులు కాస్త అసంతృప్తికి లోనైనట్లు సమాచారం.

'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ
ప్రమాదం అంచున ప్రపంచంలో అతి పెద్ద పువ్వు.. ఉనికిని కోల్పోతుందంటూ
జాన్వీ కహానీ.. డబుల్‌ 'ఆర్‌' మీదే ఫుల్ ఫోకస్.. విషయం ఇదే..
జాన్వీ కహానీ.. డబుల్‌ 'ఆర్‌' మీదే ఫుల్ ఫోకస్.. విషయం ఇదే..
Team India: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. 2వ జట్టుగా భారత్
Team India: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. 2వ జట్టుగా భారత్
తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్
తల్లిని కోల్పోయిన దుఃఖం మధ్యే డ్యూటీలో కొనసాగిన పోలీస్
'చేసింది ఊరికే పోదు..' రెహ్మన్‌ పై పోలీస్‌ కేస్‌..
'చేసింది ఊరికే పోదు..' రెహ్మన్‌ పై పోలీస్‌ కేస్‌..
పంజా విసురుతున్న విష జ్వరాలు.. మంచాన పడుతున్న గ్రామాలు
పంజా విసురుతున్న విష జ్వరాలు.. మంచాన పడుతున్న గ్రామాలు