వెంకీ జోడీగా ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రవితేజ సరసన ‘డిస్కో రాజా’, నాగార్జున సరసన ‘మన్మధుడు 2’లో నటించబోతున్న ఈ బ్యూటీ తాజాగా వెంకీ సరసన హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. వెంకటేశ్, నాగచైతన్యలు హీరోలుగా దర్శకుడు బాబీ వెంకీ మామ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్ నటిస్తుండగా.. వెంకీకి జోడీగా పాయల్ కనిపించబోతుందట. మొదట ఈ […]

వెంకీ జోడీగా ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:54 PM

‘ఆర్‌ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే రవితేజ సరసన ‘డిస్కో రాజా’, నాగార్జున సరసన ‘మన్మధుడు 2’లో నటించబోతున్న ఈ బ్యూటీ తాజాగా వెంకీ సరసన హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. వెంకటేశ్, నాగచైతన్యలు హీరోలుగా దర్శకుడు బాబీ వెంకీ మామ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్ నటిస్తుండగా.. వెంకీకి జోడీగా పాయల్ కనిపించబోతుందట.

మొదట ఈ చిత్రంలో వెంకీ జోడీగా హ్యూమా ఖురేషి, శ్రియ పేర్లు వినిపించాయి. తాజాగా ఆ ఛాన్స్‌ను పాయల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా మామ అల్లుళ్ల కథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ మూవీకి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు.