ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఇవాళ్టి నుంచి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు.

ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..
Follow us

|

Updated on: Aug 12, 2020 | 6:09 PM

Lockdown Imposed In Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఇవాళ్టి నుంచి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. ఈ రోజు నుంచి రెండు వారాల పాటు కంటైన్‌మెంట్‌ ఆంక్షలు అమలులోకి వస్తాయని అన్నారు. వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలోనే ఈ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తామని అన్నారు. ఇక తొమ్మిది తర్వాత కేవలం మెడికల్ షాపులకు అనుమతిస్తామని.. ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పని చేస్తాయన్నారు. అటు అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా రోడ్లపైకి రాకూడదని స్పష్టం చేశారు. కాగా, ప్రజలు ఈ లాక్‌డౌన్‌ను సహకరించాలని కలెక్టర్ పోల భాస్కర్ స్పష్టం చేశారు. ఇక రాజమండ్రి, కాకినాడ, తునితో పాటు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు.

Also Read: ”నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలికి వచ్చిన పార్టీ”..!