బాలీవుడ్ ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడి ఆరోగ్యం విష‌మం

బాలీవుడ్ ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడి ఆరోగ్యం విష‌మం

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామ‌త్ ఆరోగ్యం విష‌మంగా మారింది. ఈ మేర‌కు ఆయ‌న అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు. గ‌త కొంత‌కాలంగా కాలేయ స‌మ‌స్య‌తో పోరాడుతున్న నిషికాంత్ ప‌రిస్థితి విషమంగా..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 12, 2020 | 1:50 PM

బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామ‌త్ ఆరోగ్యం విష‌మంగా మారింది. ఈ మేర‌కు ఆయ‌న అనారోగ్యంతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు. గ‌త కొంత‌కాలంగా కాలేయ స‌మ‌స్య‌తో పోరాడుతున్న నిషికాంత్ ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని స‌మాచారం. గ‌తంలోనూ ఇదే స‌మ‌స్య ఎదుర‌వ్వ‌గా, చికిత్స అనంత‌రం కోలుకున్నారు. ఇప్పుడు అది తిర‌గ‌బెట్టిన‌ట్లు తెలుస్తోంది.

కాగా అజ‌య్ దేవ‌గ‌న్, శ్రియ న‌టించిన ”దృశ్యం, ఇర్ఫాన్ ఖాన్ మ‌దారి, జాన్ అబ్ర‌హం ఫోర్స్, రాకీ హ్యాండ్స‌మ్” లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు నిషికాంత్ కామ‌త్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిషికాంత్ ”డొంబివాలి ఫాస్ట్‌, లై భారీ” సినిమాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాయి. మ‌రాఠీలోనూ ఈయ‌న చాలా చిత్రాలను తెర‌కెక్కించారు. న‌టుడిగానూ నిషికాంత్ మెప్పించారు. న‌టుడిగా జాన్ అబ్ర‌హం న‌టించిన ‘రాకీ హాండ్స‌మ్’ చిత్రంలో న‌టించారు.

Read More:

రేప్ చేస్తామ‌ని క్రికెట‌ర్ షమీ భార్య‌కు బెదిరింపులు

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu