‘దోస్త్’ నోటిఫికేషన్ వచ్చింది…చివరి తేదీ ఎప్పుడంటే..

తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్'‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 'దోస్త్' నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందని 'దోస్త్' కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. ఇంటర్ లేదా దానికి సమాన అర్హత ఉన్నవారు 'దోస్త్' ద్వారా...

'దోస్త్' నోటిఫికేషన్ వచ్చింది...చివరి తేదీ ఎప్పుడంటే..
Follow us

|

Updated on: Aug 20, 2020 | 6:21 PM

ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణలో ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్’‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ‘దోస్త్’ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందని ‘దోస్త్’ కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. ఇంటర్ లేదా దానికి సమాన అర్హత ఉన్నవారు ‘దోస్త్’ ద్వారా డిగ్రీ అడ్మిషన్ పొందవచ్చని అన్నారు. ‘దోస్త్’ అడ్మిషన్ ప్రక్రియను చాలా సులభతరం చేశామని తెలిపారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చన్నారు. ‘దోస్త్’ రిజిస్ట్రేషన్‌లో ఏదైతే ఫోన్ నెంబర్ పొందుర్చుతామో అదే నెంబర్‌కు వివరాలు అందుతాయని అన్నారు. ఇందు కోసం రిజస్ట్రేషన్‌లో ఉపయోగించిన ఫోన్ నెంబర్ అడ్మిషన్ పొందే వరకు ఉంచుకోవాలన్నారు. ఈ నెల 24నుంచి ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని…. 3 ఫేజ్ లలో రిజస్ట్రేషన్ అక్టోబర్ 12 నాటికి పూర్తి అవుతుందన్నారు. ఆ తరవాత డిజిటల్ లేదా ఫిజికల్ క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని లింబాద్రి వెల్లడించారు.

‘దోస్త్‌’ నోటిఫికేషన్ వివరాలు…

ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు 

సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు

సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థుల సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం

సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం.

సెప్టెంబర్ 28న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు..