హాంకాంగ్‌తో అప్పగింత ఒప్పందం రద్దు: అమెరికా
హాంకాంగ్ పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా అమెరికా అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
హాంకాంగ్ పై చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టానికి నిరసనగా అమెరికా అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే మిలిటరీ, ఇతర సాధనాల ఎగుమతిని కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైనా హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టానికి స్పందనగా అమెరికా ఈ చర్యలు చేపట్టింది. హాంకాంగ్‌లో అమల్లోకి తెచ్చిన కొత్త జాతీయ భద్రత చట్టం, వీగర్ ముస్లింలపై వేధింపుల వంటి విషయాలపై తీవ్రంగా స్పందిస్తోంది యూఎస్.
హాంకాంగ్‌తో ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని అమెరికా రద్దు చేసుకోనున్నట్లు ప్రకటించింది. చైనా ప్రభుత్వం కొత్త జాతీయ భద్రతా చట్టం తీసుకువచ్చింది. హాంకాంగ్ నగరం స్వయంప్రతిపత్తిని నాశనం చేస్తుందనే ఆందోళనతో యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం హాంకాంగ్ అప్పగించే ఒప్పందాన్ని అధికారికంగా నిలిపివేసింది. మాజీ బ్రిటిష్ కాలనీతో వాషింగ్టన్ మూడు ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ బుధవారం ప్రకటించింది, ఇందులో నేరస్థుల అప్పగింత, శిక్షార్హమైన వ్యక్తుల బదిలీ ,ఆదాయంపై పరస్పర పన్ను మినహాయింపులు సంబంధిత కేసులు ఉన్నాయని పేర్కొంది.
“ఐక్యరాజ్యసమితి-రిజిస్టర్డ్ చైనా-బ్రిటిష్ ఉమ్మడి డిక్లరేషన్ క్రింద 50 సంవత్సరాలు యునైటెడ్ కింగ్‌డమ్, హాంకాంగ్ ప్రజలకు చైనా ప్రభుత్వం వాగ్దానం చేసిన అధిక స్థాయి స్వయంప్రతిపత్తిని చైనా ప్రభుత్వం బలహీనపరుస్తోందని యుఎస్ ప్రభుత్వం ఆరోపించింది. పాలక చైనా కమ్యూనిస్ట్ పార్టీ “హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛను, స్వయంప్రతిపత్తిని అణిచివేసేందుకు” ఎంచుకున్నందున ఒప్పందాలు నిలిపివేయబడిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయో తన అధికారిక ట్విట్టర్లో తెలిపారు.
The Chinese Communist Party chose to crush the freedoms and autonomy of the people of Hong Kong. Because of the CCP’s actions, we are terminating or suspending three of our bilateral agreements with the territory.
— Secretary Pompeo (@SecPompeo) August 19, 2020
1997 లో బ్రిటన్ నుండి చైనాకు అప్పగించినప్పటి నుండి, హాంగ్ కాంగ్ యునైటెడ్ స్టేట్స్‌తో ప్రత్యేక వాణిజ్య, భద్రతా హోదాను పొందింది. జూన్ చివరలో ప్రజాస్వామ్య స్వయంప్రతిపత్తికి అనుకూల నిరసనలు ఎక్కువయ్యాయి. దీంతో చైనా ప్రభుత్వం హాంకాంగ్ పై కఠినమైన కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని విధించింది.
చైనా జాతీయ భద్రతా చట్టానికి ప్రతిస్పందనగా జూలై 14 న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాతో హాంకాంగ్ ప్రత్యేక వాణిజ్య స్థితిని అంతం చేయాలన్న కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక, కొత్త భద్రతా చట్టం ఆమోదించిన తరువాత హాంకాంగ్‌తో అప్పగించే ఒప్పందాన్ని నిలిపివేసిన తాజా దేశం అమెరికా. కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ తమ అప్పగించే ఒప్పందాలను నిలిపివేసాయి.