ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తి నరకయాతన.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..!

ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తి నరకయాతన.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..!

S Srinivasa Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 12, 2025 | 10:53 AM

భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో క్షత గాత్రున్ని ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో ఓ ప్రయానికుడు ట్రైన్ కి, ఫ్లాట్ ఫామ్ కి మద్య ఇరుక్కుపోయాడు. ఫుట్ బోర్డు నుండి కాలు జారడం తో కోణార్క్ ట్రైన్ కి ప్లాట్ ఫామ్ కి మధ్య ఇరుక్కు పోయి నరకయాతన పడ్డాడు. భువనేశ్వర్ నుండి ముంబాయి వెళ్ళే కోణార్క్ ఎక్సప్రెస్ ట్రైన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రయాణికుడు ఫ్లాట్ ఫామ్ కి, ట్రైన్ కి మద్య ఇరుక్కుపోవటాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. చాకచక్యంగా అతనిని బయటకు తీశారు. అయితే అప్పటికే అతను తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..