AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: వీటిని ఎలా తింటారురా.! పండక్కి వస్తే పైలోకానికే పార్శిల్ చేసేలా ఉన్నారే..

సంక్రాంతి పండుగ వచ్చింది కదా..! ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేసుకుందామా.. కాసింత స్వీటూ.. కూసింత హాటూ కొనుక్కుని తిందామని అనుకునేరు.. అయితే తస్మాత్ జాగ్రత్త.. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో పలు చేదు నిజాలు బయటపడ్డాయి.

AP News: వీటిని ఎలా తింటారురా.! పండక్కి వస్తే పైలోకానికే పార్శిల్ చేసేలా ఉన్నారే..
Food Safety Raids
Ravi Kiran
|

Updated on: Jan 12, 2025 | 11:44 AM

Share

పండగ చేస్కోండి. కానీ సరుకులు ,స్వీట్లు కొనేప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండండి. కలర్స్‌కు టెంప్టయి స్వీట్లు కొంటే హెల్త్‌కు రంగుపడ్డం ఖాయం. ఎందుకంటే ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అలాంటి చేదు నిజాలు తెరపైకి వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ నగర వ్యాప్తంగా స్వీట్‌ హౌస్‌లు.. హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఫుడ్‌ సేఫ్టీ అధికారు. షాప్‌లతో పాటు స్వీట్లు తయారు చేసే ఖార్ఖనాల్లో చెకింగ్స్‌ నిర్వహించారు. బేకారీలను తనిఖీ చేస్తే అక్కడి బేకార్‌ పరిస్థితి బయటపడింది. శుచి శుభ్రత సరికదా..నిబంధనలకు విరుద్ధంగా కలర్స్‌ వాడుతున్నట్టు తేలింది. కొందరు ఎక్సైపరీ డేట్‌ లేకుండా ఫుడ్‌ ప్యాక్‌ చేసి విక్రయిస్తుంటే..మరికొందరు లైసెన్స్‌లు లేకుండా దందా చేస్తున్నట్టు గుర్తించారు ఫుడ్‌ సేప్టీ అధికారులు.

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

జిల్లా కలెక్టర్‌, ఫుడ్‌ సేఫ్టీ కమీషనర్‌ ఆదేశాలతో ఐదు టీమ్‌లు స్పెషల్‌ రెయిడ్స్‌ చేపట్టాయి. నోరిరించే స్వీట్ల తయారీ వెనుక ప్రజారోగ్యానికి ఎసరు పెడుతోన్న నిర్వాకలు బయటపడ్డాయి తనిఖీల్లో. అదీ సంగతి. కలర్‌ఫుల్‌ స్వీట్లు క్యాన్సర్ కారకాలు. శాంపిల్స్‌ సేకరించిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వాటిని ల్యాబ్‌కు పంపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతాయన్నారు. బడా మాల్‌ ..చోటా మాల్‌.. షాప్‌ ఏదైనా సరే పండగ వేళ ఇంత గోల్‌మాల్‌ జరుగుతోంది. రంగులు చూసి స్వీట్లు కొనడం అంటే..డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకోవడమే. సో..జరభద్రం బీకేర్‌ఫుల్‌.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఫస్ట్ ఫ్లాప్.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్.. 15 రోజుల్లో పూర్తైన ఈ మూవీ ఏంటంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్