అమెరికాకు ప‌ట్టిన అంధ‌కారాన్ని వ‌దిలిస్తా: జోసెఫ్ బైడె‌న్

అమెరికాకు ప‌ట్టిన అంధ‌కారాన్ని వ‌దిలించేందుకు అవకాశం ఇవ్వాలని జోసెఫ్ బైడె‌న్ కోరారు. అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడె‌న్ నామినేష‌న్‌ను అంగీక‌రించారు.

అమెరికాకు ప‌ట్టిన అంధ‌కారాన్ని వ‌దిలిస్తా: జోసెఫ్ బైడె‌న్
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 21, 2020 | 11:57 AM

అమెరికాకు ప‌ట్టిన అంధ‌కారాన్ని వ‌దిలించేందుకు అవకాశం ఇవ్వాలని జోసెఫ్ బైడె‌న్ కోరారు. అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడె‌న్ నామినేష‌న్‌ను అంగీక‌రించారు. ప్రస్తుత అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశాన్ని చీక‌ట్లోకి నెట్టేశాడని, తాను గెలిస్తే దేశంలో ఉన్న చీక‌ట్ల‌ను పార‌ద్రోలి.. వెలుగును నింపుతానంటూ బైడెన్ ఉద్ఘాటించారు. డెలావ‌ర్‌లోని విల్మింగ్ట‌న్‌లో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. దేశంలో ప్రజల మధ్య ద్వేషాన్ని, భ‌యాన్ని, విభ‌జ‌న‌ను ట్రంప్ క్రియేట్ చేశార‌ని బైడెన్ విమ‌ర్శించారు. న‌మ్మ‌కంతో తన‌ను అధ్య‌క్షుడిని చేస్తే, ఉత్త‌మైన పాల‌ను అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. దేశ ప్ర‌జ‌లంతా ఒక్క‌టి కావాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు. పాలనలో ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా.. మనమంతా ఒక‌టిగా ఉంటే అమెరికాకు ప‌ట్టిన అంధ‌కారాన్ని వ‌దిలించ‌గ‌ల‌మ‌న్నారు. భ‌యాన్ని ఆశ‌తో జ‌యిద్దామ‌ని, ఊహాల్లో కాదన్న బైడెన్.. వాస్త‌వాల‌ను జోడిద్దామ‌ని, ప్ర‌త్యేక అధికారాల‌కు బ‌దులుగా మంచిత‌నాన్ని నింపుదామ‌న్నారు. న‌వంబ‌ర్‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బ్యాలెట్ రూపంలో పార్టీలు కాదని, మ‌నిషి గుణాల మధ్య పోటీ జరుగుతుందన్నారు బైడెన్.