ఢిల్లీలో కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. బీజేపీలో చేరికపై కమలం పెద్దలతో చర్చించేందుకు రాజగోపాల్ రెడ్డి హస్తినకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయితే, దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తన ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. తన సోదరుడు భువనగిరి నుంచి గెలిచిన ఎంపీ వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం కోసమే వచ్చినట్టు తెలిపారు. బీజేపీలో చేరిక మీద తాను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని […]

ఢిల్లీలో కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Jun 17, 2019 | 8:02 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. బీజేపీలో చేరికపై కమలం పెద్దలతో చర్చించేందుకు రాజగోపాల్ రెడ్డి హస్తినకు వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయితే, దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తన ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యం లేదన్నారు. తన సోదరుడు భువనగిరి నుంచి గెలిచిన ఎంపీ వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం కోసమే వచ్చినట్టు తెలిపారు. బీజేపీలో చేరిక మీద తాను ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అభిమానులు కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేసి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే కూడా హస్తం పార్టీకి ఈ గతి పట్టేది కాదని తెలిపారు.