బ్రేకింగ్: అమరావతి రైతులతో చర్చలకు రెడీ.. కొడాలి
రాజధాని కోసం ఆందోళన చేస్తోన్న అమరావతి ప్రాంత రైతులతో చర్చలకు సిద్ధమని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని కొడాలి నాని కోరారు. భూముల రేట్లు పడిపోతాయేమోనని ఆందోళన రైతుల్లో ఉందని, దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై చర్చిండానికి తాము సిద్ధమన్నారు కొడాలి నాని. పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీలు చాలా స్పష్టంగా మూడు ప్రాంతాలను రాజధానిగా ఉండాలని చెప్పాయి. ఆ కమిటీ సూచనల ప్రకారమే ప్రభుత్వం చేస్తోంది. కొన్ని […]
రాజధాని కోసం ఆందోళన చేస్తోన్న అమరావతి ప్రాంత రైతులతో చర్చలకు సిద్ధమని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ఆందోళన చేస్తోన్న రైతాంగాన్ని చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దని కొడాలి నాని కోరారు. భూముల రేట్లు పడిపోతాయేమోనని ఆందోళన రైతుల్లో ఉందని, దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై చర్చిండానికి తాము సిద్ధమన్నారు కొడాలి నాని. పలు ప్రాంతాల్లో పర్యటించిన కమిటీలు చాలా స్పష్టంగా మూడు ప్రాంతాలను రాజధానిగా ఉండాలని చెప్పాయి. ఆ కమిటీ సూచనల ప్రకారమే ప్రభుత్వం చేస్తోంది. కొన్ని పార్టీలు చేస్తున్న ఆందోళనలకు మాత్రం తలొగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. రైతులు, ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధమైతే.. తాము కూడా చర్చలకు రెడీ అని నాని పేర్కొన్నారు. అలాగే.. మీ భూములకు ఎలాంటి విలువ తగ్గకుండా చూస్తామన్నారు. ఎలాగైనా మీకు న్యాయం జరిగేలా చూస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కాగా ఈ నెల 20వ తేదీ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. రాజధాని అంశంపై ఆరోజే సభలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.