ఎన్టీఆర్‌కు కథ చెప్పిన ‘కేజీఎఫ్’ దర్శకుడు..!
'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్... ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని చేస్తున్నాడు. మరోపక్క, ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్‌లో...
‘కేజీఎఫ్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్… ప్రస్తుతం ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని చేస్తున్నాడు. మరోపక్క, ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడని టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఇటీవల ఎన్టీఆర్ ను కలసి ప్రశాంత్.. ఓ కథ చెప్పాడని తెలుస్తోంది.
ఈ విషయంలో మరోసారి ఇద్దరూ కలసి కథపై చర్చించుకోవడం జరుగుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి ముందుకువచ్చింది అనుకుంటున్నారు. భారీ బడ్జెట్టుతో రూపొందే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన వెంటనే, త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తాడు. దాని తర్వాత ప్రశాంత్ సినిమా మొదలవుతుందట. ఇది ‘కేజీఎఫ్’ స్థాయిలో ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ప్రచారం చేస్తున్నారు.