మునిసిపల్ ఎన్నికలపై కేసీఆర్ సూపర్ కామెంట్స్
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గురువారం రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన మునిసిపల్ ఎన్నికల ప్రిపరేషన్‌పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్నికలను ఎదుర్కోవాల్సిన విధానాన్ని వివరించారు. గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనంటూ.. 90 శాతానికి పైగా సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని పార్టీ వర్గాలను, నేతలను ఉత్సాహపరిచారు కేసీఆర్. ఎలెక్షన్ గ్రౌండ్‌లో వున్నది కేవలం టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని.. […]
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గురువారం రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన మునిసిపల్ ఎన్నికల ప్రిపరేషన్‌పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్నికలను ఎదుర్కోవాల్సిన విధానాన్ని వివరించారు.
గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలదేనంటూ.. 90 శాతానికి పైగా సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలవబోతోందని పార్టీ వర్గాలను, నేతలను ఉత్సాహపరిచారు కేసీఆర్. ఎలెక్షన్ గ్రౌండ్‌లో వున్నది కేవలం టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని.. ఎవరూ మనకు పోటీకారు.. పోటీకి రాలేరని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
‘‘ మనకు ఎవరు పోటీ కారు.. అభ్యర్థులను గెలిపించి తీసుకురండి‘‘ అంటూ కేసీఆర్ సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వచ్చిన వర్గాల వల్ల పార్టీ టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ వుందని, అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా వ్యవహరించాలని, రెబల్స్ బెడద రాకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు.
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలోకి దిగే రెబల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఆదేశించారు.