స్పెషల్ విజిట్.. జమ్మూకాశ్మీర్లో విదేశీ దౌత్య ప్రతినిధుల టూర్

అమెరికాతో సహా 17 దేశాల నుంచి విదేశీ దౌత్య ప్రతినిధులు గురువారం జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన  ఈ ‘ మాజీ ‘ రాష్ట్రంలో వీరు  రెండు రోజులు పర్యటించనున్నారు. యుఎస్ తో బాటు వియత్నాం, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఉజ్బెకిస్థాన్, నైగర్, నైజీరియా, మొరాకో, గుయానా , ఆర్జెంటీనా, ఫిలిప్పీన్స్, నార్వే, మాల్దీవులు, ఫిజీ, టోగో, బంగ్లాదేశ్, పెరు  దేశాల రాయబారులు, దౌత్యాధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి […]

స్పెషల్ విజిట్.. జమ్మూకాశ్మీర్లో విదేశీ దౌత్య ప్రతినిధుల టూర్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2020 | 2:07 PM

అమెరికాతో సహా 17 దేశాల నుంచి విదేశీ దౌత్య ప్రతినిధులు గురువారం జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టారు. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన  ఈ ‘ మాజీ ‘ రాష్ట్రంలో వీరు  రెండు రోజులు పర్యటించనున్నారు. యుఎస్ తో బాటు వియత్నాం, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఉజ్బెకిస్థాన్, నైగర్, నైజీరియా, మొరాకో, గుయానా , ఆర్జెంటీనా, ఫిలిప్పీన్స్, నార్వే, మాల్దీవులు, ఫిజీ, టోగో, బంగ్లాదేశ్, పెరు  దేశాల రాయబారులు, దౌత్యాధికారులు ఈ బృందంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని కేంద్రం గత ఆగస్టు 5 న రద్దు చేసిన అనంతరం ఇక్కడ ఇంటర్నెట్ తో సహా పలు రకాల ఆంక్షలను విధించిన విషయం గమనార్హం. ఇటీవలే ఐరోపా యూనియన్ దేశాలకు చెందిన 23 మంది ఎంపీల విజిట్ తరువాత ఇంతమంది విదేశీ దౌత్యాధికారుల పర్యటన ఇదే మొదటిది. ఈ సారి ఆ ఎంపీలు తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. గతంలో తాము ఇక్కడికి వచ్చినప్పుడు గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను కలుసుకునేందుకు వీరికి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. కాగా-ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చేరుకున్న 17  దేశాల దౌత్య ప్రతినిధులు ఇక్కడి  ప్రస్తుత పరిస్థితిని మదింపు చేస్తారని తెలుస్తోంది. వీరిలో ఇండియాకు అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ కూడా ఉన్నారు.

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం