బిగ్ బ్రేకింగ్: ఢిల్లీలో.. ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్!
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇవాళ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఐఎస్ఐఎస్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఎన్‌కౌంటర్ తర్వాత నిందితులను అరెస్టు చేసినట్లుపోలీసులు తెలిపారు. ఐసిస్ నిందితులను దేశ రాజధానిలో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల నుంచి […]
ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇవాళ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఐఎస్ఐఎస్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఎన్‌కౌంటర్ తర్వాత నిందితులను అరెస్టు చేసినట్లుపోలీసులు తెలిపారు. ఐసిస్ నిందితులను దేశ రాజధానిలో అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది. ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడినట్టు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపాయి. తమిళనాడు పోలీసులు ఓ జిహాదీ ఉగ్రవాద ముఠాను పట్టుకున్న రోజే ఢిల్లీ పోలీసులకు మరో ముగ్గురు ఉగ్రవాదులు చిక్కడం గమనార్హం. అరెస్టయిన వారు ఖ్వాజా మౌద్దీన్ (52), సయ్యద్ నవాజ్ (32), మూడవ నిందితుడు అబ్దుల్ సమద్ గా తెలుస్తోంది.
కాగా.. ఎస్ఐఎస్ కదలికలపై కొద్ది రోజుల నుంచి నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నేపాల్ సరిహద్దు ద్వారా 5గురు అనుమానితులు భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్ సరిహద్దు కలిగిన యూపీ జిల్లాల్లో(బస్తీ, గోరఖ్‌పూర్, సిద్ధార్థ నగర్, ఖుషినగర్, మహారాజ్‌గంజ్) హైఅలర్ట్ హెచ్చరిక జారీ చేశారు.
[svt-event date=”09/01/2020,4:03PM” class=”svt-cd-green” ]
Delhi Police Special Cell busts ISIS terror module in Delhi, 3 terror suspects arrested pic.twitter.com/p1w8oLxrap
— ANI (@ANI) January 9, 2020
[/svt-event]