ఆల్ టైమ్ రికార్డు ధరను తాకిన బంగారం..! వెండి పరిస్థితి ఎలా ఉందంటే..?
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఆల్-టైమ్ రికార్డు చేరింది. రాజకీయ అనిశ్చితి, భూరాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత వంటివి బంగారానికి డిమాండ్ పెంచాయి. వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి, సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగం పెరగడంతో పాటు బంగారం ధరలు అధికం కావడంతో వెండి పెట్టుబడులకు ప్రత్యామ్నాయంగా మారింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఆల్-టైమ్ రికార్డుకు చేరుకుంది. ఔన్సు ధర ఏకంగా 4,600 డాలర్లు దాటేసింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌పై ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడి పెంచడం, రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ భయాందోళలో ఉంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు. ఇరాన్, మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరగడంతో సురక్షితమైన పెట్టుబడిగా అంతా బంగారంపై నమ్మకం పెట్టుకోవడంతో దానికి డిమాండ్ పెరిగింది. అమెరికా డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో బంగారం ఇప్పుడు ఇన్వెస్టర్లకు హాట్ కేకులా మారింది.
బంగారంతో పోటీపడుతున్న వెండి
బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. గత రికార్డులను చెరిపేస్తూ ఔన్సు ధర 80 నుంచి 85 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది. ఇది ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్లడంతో.. ఇన్వెస్టర్లు తక్కువ ధరలో ఉన్న వెండిని ప్రత్యామ్నాయంగా భావించి దాన్ని ఎంచుకుంటున్నారు. 2025-26లో బంగారంతో పోలిస్తే వెండిలోనే ఎక్కువ లాభాలు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
