బ్రేకింగ్ : భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్ భారీ స్కెచ్..!

ఇండియాలో ఉగ్రవాద దాడులు నిర్వహించేందుకు జమ్మత్ ఉల్ ముజాహిద్దీన్ అనే బంగ్లాదేశ్ టెర్రర్ గ్రూప్‌కి పాకిస్థాన్ నిధులు సమకూరుస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది.  ఐఎస్‌ఐ మోనెటరింగ్‌లో భారత్‌లో ఉగ్ర దాడులకు జరిపేందుకు బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలకి శిక్షణ ఇస్తున్నటు సమాచారం. జీ మీడియా యాక్సెస్ తెలిపిన నివేదిక ప్రకారం, ఐఎస్ఐ తన దుర్మార్గపు మిషన్ కోసం బంగ్లాదేశ్ యొక్క కాక్స్ బజార్లో ఉంటున్న దాదాపు 40 మంది రోహింగ్యాలను నియమించింది. బంగ్లాదేశ్‌లో అత్యంత ఘోరమైన టెర్రర్ గ్రూపు […]

బ్రేకింగ్ : భారత్‌లో ఉగ్ర దాడులకు పాక్ భారీ స్కెచ్..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2020 | 1:33 PM

ఇండియాలో ఉగ్రవాద దాడులు నిర్వహించేందుకు జమ్మత్ ఉల్ ముజాహిద్దీన్ అనే బంగ్లాదేశ్ టెర్రర్ గ్రూప్‌కి పాకిస్థాన్ నిధులు సమకూరుస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది.  ఐఎస్‌ఐ మోనెటరింగ్‌లో భారత్‌లో ఉగ్ర దాడులకు జరిపేందుకు బంగ్లాదేశ్‌లోని రోహింగ్యాలకి శిక్షణ ఇస్తున్నటు సమాచారం. జీ మీడియా యాక్సెస్ తెలిపిన నివేదిక ప్రకారం, ఐఎస్ఐ తన దుర్మార్గపు మిషన్ కోసం బంగ్లాదేశ్ యొక్క కాక్స్ బజార్లో ఉంటున్న దాదాపు 40 మంది రోహింగ్యాలను నియమించింది. బంగ్లాదేశ్‌లో అత్యంత ఘోరమైన టెర్రర్ గ్రూపు అయిన జెఎమ్‌బి ఈ శిక్షణ ఇస్తోంది. ట్రైనింగ్ కోసం సౌదీ అరేబియా, మలేషియా, యునైటెడ్ కింగ్‌డమ్, పాకిస్తాన్‌లోని గ్రూపుల నుంచి ఐఎస్‌ఐ నిధులు అందుకున్నట్లు  సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇప్పటికే మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద జెఎంబికి రూ .1 కోటి ఇచ్చినట్టు తెలుస్తోంది.