‘ నిర్భయ ‘ కేసులో దోషులకు తప్పని ఉరి ? క్యురేటివ్ పిటిషన్ అంటే ?

నిర్భయ కేసులో నలుగురు దోషులను  ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ అనే వీరిని  ఆ రోజున  ఉరి తీయనున్నారు. వీరి రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దోషి.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు […]

' నిర్భయ ' కేసులో దోషులకు తప్పని ఉరి  ? క్యురేటివ్ పిటిషన్ అంటే ?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 09, 2020 | 2:13 PM

నిర్భయ కేసులో నలుగురు దోషులను  ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్ అనే వీరిని  ఆ రోజున  ఉరి తీయనున్నారు. వీరి రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది. వినయ్ శర్మ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దోషి.. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పు పక్షపాతపూరితంగా ఉందని అందులో పేర్కొన్నాడు.

రివ్యూ పిటిషన్ అంటే ?

ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఇచ్ఛే తీర్పే ఫైనల్.. అయితే రాజ్యాంగంలోని 137 అధికరణం కింద సుప్రీంకోర్టు తానిఛ్చిన తీర్పును తానే తిరిగి సమీక్షించవచ్ఛు. ఇందుకు కోర్టుకు అధికారాలు ఉన్నాయి. ఇదివరకు ఇఛ్చిన తీర్పులో ఏవైనా పొరబాట్లు ఉన్న పక్షంలో వాటిని కోర్టు సరిదిద్దుతుంది. పైగా పిటిషనర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్ఛు.

ఇక క్యురేటివ్ పిటిషన్ అంటే ?

ఈ పిటిషన్ ద్వారా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు సంబంధించి రెండో రివ్యూకు ఇది ఆస్కారం కల్పిస్తుంది. 2002 లో రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసులో అయిదుగురు న్యాయమూర్తులతో  కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. కోర్టు తన తుది తీర్పులో ఏదైనా ‘ మిస్ క్యారేజ్ ఆఫ్ జస్టిస్ ‘ (న్యాయం సరిగా జరగలేదని) ఉందని  భావిస్తే దానిని సరిదిద్దుకోవచ్ఛునని స్పష్టం చేసింది. అలాంటపుడు బాధితుడు (దోషి) దాఖలు చేసే క్యురేటివ్ పిటిషన్‌ని కోర్టు అనుమతిస్తుంది. తుది తీర్పును లిటిగెంట్స్ సవాలు చేయజాలరని కోర్టు పేర్కొన్నప్పటికీ.. ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పక్షపాతపూరితంగా ఉందని, అది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా ఉందని ఈ పిటిషన్‌లో అతగాడు అభిప్రాయపడవచ్ఛు. రాష్ట్రపతి అతని మెర్సీ పిటిషన్‌ని తిరస్కరించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ దాన్ని సమీక్షించవచ్ఛుకూడా.ఇలా ఉండగా నిర్భయ కేసులో  దోషి అయిన వినయ్ శర్మ గురువారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. మరోవైపు..తీహార్ జైలు  అధికారులు ‘ డమ్మీ ఉరి ‘ సన్నాహాలను ఈ జైలు 3 వ భాగంలో నిర్వహించనున్నారు. ఉరి తీసేముందు అతని కుటుంబ సభ్యులతో ఒకసారి మాత్రం మాట్లాడనిస్తారు. పైగా ఉరి తీసే వ్యక్తిని ఏకాంతంగా ఒక సెల్‌లో ఉంచుతారు.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..