మహేష్‌ ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్

సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. మహేష్ నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్పెషల్ షోలు వేసుకునేందుకు జగన్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో తెల్లవారుజామున […]

మహేష్‌ ఫ్యాన్స్‌కు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 09, 2020 | 1:36 PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. మహేష్ నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్పెషల్ షోలు వేసుకునేందుకు జగన్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ క్రమంలో తెల్లవారుజామున గం.1 నుంచి గం.10ల మధ్యలో రెండు షోలను వేయనున్నారు థియేటర్ యజమానులు. దీంతో సరిలేరు టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరుకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక నటిస్తుండగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బండ్ల గణేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, మహేష్ బాబు, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో చాలా అంచనాలు ఉన్నాయి.