ఆ విషయాలేవీ చెప్పని ఎన్టీఆర్..!
ఆర్ఆర్ఆర్… దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై కేవలం టాలీవుడ్‌లోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అందునా స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మొదటిసారి నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు జక్కన్న. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బయట పెద్దగా కనిపించని ఎన్టీఆర్.. […]
ఆర్ఆర్ఆర్… దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై కేవలం టాలీవుడ్‌లోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అందునా స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి మొదటిసారి నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు జక్కన్న.
అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బయట పెద్దగా కనిపించని ఎన్టీఆర్.. బుధవారం మొదటిసారిగా అభిమానుల ముందుకు వచ్చారు. తన సోదరుడు కల్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్టీఆర్. అయితే ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ గురించి ఎన్టీఆర్ ఏదైనా మాట్లాడతారని ఫ్యాన్స్ ఎదురుచూశారు. అలాగే తదుపరి ప్రాజెక్ట్‌లపై ఏదైనా హింట్ ఇస్తారని అనుకున్నారు. కానీ అతడు మాత్రం సైలెంట్‌గా ఈవెంట్ గురించి మాట్లాడి.. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలన్నింటికి ఆల్ ద బెస్ట్ చెప్పి స్పీచ్‌ను ముగించేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు.
కాగా భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీని జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.