Naa Anveshana : ప్రపంచ యాత్రను ఆపేస్తున్నా.. ఇకపై నా పోరాటం అందుకే.. నా అన్వేషణ సంచలన నిర్ణయం..
ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు నా అన్వేషణ. యూట్యూబర్ నా అన్వేషణ ఇటీవల సీతదేవి, ద్రౌపది గురించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇండియాకు తీసుకువచ్చి కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా నా అన్వేషణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లించారు.

యూట్యూబర్.. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి అతడు సుపరిచితమే. ఇటీవల కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అతడు.. ఇప్పుడు తన ప్రపంచ యాత్రను ఆపేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా సంపాదించింది చాలు.. కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నానని ప్రకటించారు. అంతేకాదు.. తన దగ్గర ఉన్న 8 కోట్లను ఖర్చు పెట్టుకుంటానని. అలాగే ప్రజా సమస్యలపై పోరాడుతానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం నా అన్వేషణ షేర్ చేసిన వీడియో నెట్టింట క్షణాల్లో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో నా అన్వేషణ మాట్లాడుతూ.. “మీ ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యూత్రను ఆపేద్ధం అనుకుంటున్నాను. నా దగ్గరున్న రూ.8 కోట్లను కూర్చుని తినేద్దాం అనుకుంటున్నా. చాలు ఇప్పటివరకు సంపాదించింది. ఇప్పటికీ 130 దేశాలు తిరిగాను. ఇక మిగిలిన దేశాలన్నీ కరేపాక్ దేశాలు. వాటిని నా కోసం తిరుగుతాను. మీ కోసం కాకుండా తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచ యాత్రికుడు ఒక్కడే కాదు. అలాగే అంటార్కిటికాను ఎవరూ చూపించలేదు. నేను చూపించినందుకు నాకు రూ.20 లక్షలు వచ్చాయి. ఆర్కిటిక్ మొత్తం చూపించా రూ.15 లక్షలు వచ్చాయి. అమెజాన్ అడవులను దాదాపు 100 రోజులు చూపించాను. దాదాపు రూ.20 లక్షలు వచ్చాయి. నాకు డబ్బే డబ్బు ఇలా ప్రపంచ దేశాలననీ తిరిగి చూపిస్తే నాకు డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చుని సెల్లు వీడియోస్ చేస్తే డబ్బులు ఇవ్వరు. ఇప్పటికే చాలా సంపాదించాను.
ఇక పై కొత్త వాళ్లకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. కొత్త రకం రావాలి. ఈ ప్రయాణంలో కాళ్లు చేతులు విరుగుతాయి. ప్రాణాలు పోతాయి. ఎన్ని జరిగినా ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకుని ముందుకు వెళ్లండి. ఇకపై నేను ప్రజా సమస్యలపై దృష్టి పెడతాను. ఆన్ లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్, డేటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. వాటిన్నింటిపై అవగాహన కల్పిస్తూ పోరాటం చేస్తాను. ప్రజల్ని ఆన్ లైన బాధల నుంచి కాపాడతాను. ఆడాళ్లపై జరిగే రేప్ ల గురించి మాట్లాడాతాను. స్త్రీ హక్కులపై పోరాడదాం. ప్రాణాలు ఉన్నంతవరకూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాను” అంటూ చెప్పుకొచ్చారు.
నా అన్వేషణ లేటేస్ట్ వీడియో…
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
