టాక్సిక్ కాంట్రవర్సీ.. సొంత వాళ్లే యశ్‌కు షాక్ ఇచ్చారుగా
యశ్ నటించిన టాక్సిక్ టీజర్ రికార్డు వ్యూస్ సాధించినా, వివాదాలు చుట్టుముడుతున్నాయి. "ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్" పేరుతో ఇష్టానుసారం తీస్తున్నారనే విమర్శలు, ముఖ్యంగా కర్ణాటక పరిశ్రమ నుంచే వస్తున్నాయి. యశ్ అసంతృప్తితో రీషూట్లు జరుగుతున్నాయని వార్తలున్నాయి. కేజీఎఫ్ తర్వాత రిస్క్ తీసుకోని యశ్, 2026 మార్చి 19న టాక్సిక్ తో రాబోతున్నారు.
యశ్ నటించిన టాక్సిక్ సినిమా టీజర్ విడుదలైన క్షణం నుంచి వ్యూస్ పరంగా రికార్డులు తిరగరాస్తోంది. అయితే, అదే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా “ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్” పేరుతో ఇష్టమొచ్చినట్టు తీస్తారా అనే కాంట్రవర్సీ రేగుతోంది. ఈ విమర్శలు యశ్ సొంత ఇండస్ట్రీ అయిన కర్ణాటక నుంచే ఎక్కువగా వస్తున్నాయని సమాచారం. కేజీఎఫ్ చాప్టర్ 2 విజయం తర్వాత యశ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. మూడేళ్లు గడిచినా ఆయన మరో సినిమా విడుదల చేయకపోవడానికి, తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సిక్ తో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో అవుట్పుట్ విషయంలో యశ్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలున్నాయి. చాలావరకు సీన్స్ రీషూట్ చేయాలని దర్శకురాలికి సూచించారని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తమిళ పొంగల్‌కు ఏం జరుగుతుంది.. అన్నీ అనుమానాస్పదమే
నెక్స్ట్ రూ. 1000 కోట్లు ఎవరిది..? రేసులో ఉన్నదెవరు..?
బాలీవుడ్‌లో న్యూ గ్లామర్.. క్యూ కడుతున్న కొత్త హీరోయిన్లు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

