Toxic: కారులో ఆ పాడు సీన్ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్
యష్ 'టాక్సిక్' సినిమా టీజర్ తీవ్ర వివాదంగా మారింది. హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ఇంటిమేట్ సన్నివేశంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అడ్వకేట్ లోహిత్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు, పిల్లల చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. సినిమాల్లో అశ్లీలత పెరుగుతోందనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సీన్లను తొలగించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
సినిమాల్లో అశ్లీత పెరిగిపోతుందనే చర్చ.. ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. సందర్భానుసారం నడుస్తూనే ఉంది. అయితే ఇదే చర్చ టాక్సిక్ నుంచి రీలీజ్ అయిన టీజర్ కారణంగా మరో సారి మొదలైంది. మొదలవ్వడమే కాదు ఇప్పుడో వివాదంగా కూడా మారింది. కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా.. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా టాక్సిక్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న ఈసినిమా నుంచి రీసెంట్‌గా ఓ టీజర్ బయటికి వచ్చింది. అయితే ఆ టీజర్ బిగినింగ్‌లో.. హీరో యశ్.. హీరోయిన్ మధ్య.. కార్‌లో ఓ ఇంటిమెసీ సీన్ ఉండడం వివాదాస్పదంగా మారింది. యశ్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో.. ఇలాంటి సీన్లలో నటించడం.. ఆ సీన్లు టీజర్‌లో ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విమర్శలు రావడమే కాదు.. ఆ ఇంటిమెసీ సన్నివేశాలను వెంటనే తొలగించాలని.. సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర మంలోనే అడ్వకేట్ లోహిత్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఇలాంటి సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దంటూ తన లేఖలో పేర్కొన్నాడు.యూట్యూబ్, ఫేస్ బుక్ లో పెద్దలకు మాత్రమే అని చెప్పే కమ్యూనిటీ మార్గదర్శకాలు ఉన్నాయని.. కానీ టీజర్ లో మాత్రం అసభ్యకరమైన కంటెంట్ చూపించారని.. దీంతో పిల్లల చట్టాలను ఉల్లంఘించారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం.. ఇది కుటుంబ సమేతంగా చూసే సినిమా కాదని, చిన్న పిల్లలకు చూపించకూడదని ముందుగానే హెచ్చరించాలని.. కానీ టాక్సిక్ మేకర్స్ అలా చేయకపోవడంపై మండిపడ్డాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Weather Update: సంక్రాంతి వేళ వర్ష సూచన ఆ జిల్లాలకు ఐఎండీ అలర్ట్
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే

