Devayani: సింగర్‌గా సత్తా చాటుతోన్న దేవయాని కూతురు.. త్వరలోనే హీరోయిన్‌గా కూడా.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించింది దేవయాని. ఇప్పుడు హీరో, హీరోయిన్లకు తల్లిగా, అత్తమ్మగా, అక్కగా, వదినగా నటిస్తుంది. ఇప్పుడు దేవయాని సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది దేవయాని. ముఖ్యంగా తెలుగులో ఆమె హీరోయిన్ గా నటించిన సుస్వాగతం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతోనే తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. దీని తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది దేవయాని. అన్నట్లు దేవయాని భర్త కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. అజిత్, పార్తీపన్, దేవయాని ప్రధాన పాత్రలు పోషించిన నీ వరువాయా ఎన్నా అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించి గుర్తింపు పొందాడు రాజ్ కుమార్. దీని తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలను తెరకక్కించాడు. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. అయతే ఇప్పుడు దేవయాని- రాజ్ కుమార్ సినీ వారసత్వాన్ని కొనసాగించేందుకు వీరి కూతురు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనుంది.
దేవయాని- రాజ్ కుమార్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. వీరిలో ఇనియకు ఇప్పటికే సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. జీ సరిగమప వంటి సింగింగ్ రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఇక త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ కూడా ఇవ్వనుంది. ఇటీవల ఇదే విషయంపై దేవయాని మాట్లాడింది. తన పెద్ద కూతురు ఇనియను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నట్లు పేర్కొంది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడు జెసన్ సంజయ్‌ను హీరోగా నటించే అవకాశముందని తెలిపింది. జెసన్ సంజయ్, ఇనియ జంటగా నటించే సినిమా కథ కూడా రెడీ అయ్యిందని దేవయాని చెప్పుకొచ్చింది.
దేవయాని కూతురు ఇనియా బర్త్ డే ఫొటోస్ వైరల్
View this post on Instagram
కాగా ఇటీవలే తన 20వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది దేవయాని. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
సింగర్ గా సత్తా చాటుతోన్న దేవయాని కూతురు
View this post on Instagram
సింగింగ్ రియాలిటీ షోలో ఇనియా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




