‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
హైదరాబాద్ మరోసారి దేశంలో బిర్యానీ రాజధానిగా నిలిచింది. స్విగ్గీ 2023 నివేదిక ప్రకారం, 1.75 కోట్ల బిర్యానీ ఆర్డర్లతో భాగ్యనగరం అగ్రస్థానంలో ఉంది. చికెన్ బిర్యానీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకున్న అద్భుతమైన ఆదరణను, నగర ఖ్యాతిని మరోసారి చాటుతున్నాయి.
హైదరాబాద్ బిర్యానీ అంటే మామూలుగా ఉండదు మరి. దేశవిదేశాలనుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేయకుండా ఉండలేరు. అంతగా ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి అంత పాపులారిటీ ఉంది మరి. అంతేనా.. హైదరాబాద్‌ని ఏకంగా బిర్యానీ క్యాపిటల్‌గా మార్చేసింది. తాజాగా మరోసారి దేశంలోనే బిర్యానీ రాజధానిగా హైదరాబాద్ నిలిచింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే బిర్యానీ క్యాపిటల్ గా భాగ్యనగరం నిలిచింది. గతేడాది ఏకంగా 1.75 కోట్ల బిర్యానీలు ఆర్డర్ చేశారు ప్రజలు. అది కూడా ఒకే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా కావడం విశేషం. స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా 2025 లో ఏకంగా కోటీ 75 లక్షల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్విగ్గీ వార్షిక రిపోర్టులో వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా ఆర్డర్ చేసిన బిర్యానీలలో ఇది దాదాపు 18 శాతం కావడం గమనార్హం. బిర్యానీలో చికెన్ బిర్యానీకి కోటీ 8 లక్షల ఆర్డర్లు వచ్చాయి. అంటే బిర్యానీ మొత్తం ఆర్డర్లలో ఇది 61 శాతంగా ఉంది. ఇక బిర్యానీ తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్ లో వెజ్ దోశ ఉంది. వెజ్ దోశకు మొత్తం 39.9 లక్షలు ఆర్డర్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో ఇడ్లీ ఉంది. ఇడ్లీకు 34 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తన రిపోర్టులో పేర్కొంది. అంతేకాదు, స్విగ్గీ ద్వారా అత్యధిక ఆదాయం అందుకున్న నగరాల్లో హైదరాబాద్ నగరం మూడో స్థానంలో ఉంది. భాగ్యనగరంలోని ప్రతి హోటల్ లో బిర్యానీ ఫేవరెట్ డిష్ గా ఉంటుంది. నిజాం నవాబుల దగ్గర్నుంచి హైదరాబాదీ బిర్యానీకి ఎంతో చరిత్ర ఉంది. హైదరాబాద్ బిర్యానీకి జియో ట్యాగ్ కోసం కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం ఈ అంశం పెండింగ్ లో ఉంది. అయితే తాజాగా మరోసారి బిర్యానీ క్యాపిటల్ గా హైదరాబాద్ నిలిచింది. ఈ మేరకు దేశంలోనే బిర్యానీ రాజధానిగా హైదరాబాద్ నిలవడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి భక్తులు అలెర్ట్.. జనవరి 24 నుండి 26 వరకు SSD టోకెన్లు రద్దు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్

