Mana Shankara Vara Prasad: సినిమా బ్లాక్ బాస్టర్ వేళ ఊహించని విషాదం.. మూవీ చూస్తూ అభిమాని మృతి
బ్లాక్‌బాస్టర్ హంగామా నడుస్తున్న వేళ విషాదం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ హైదరాబాద్ కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఫ్యాన్స్ పూనకాల మధ్య స్క్రీనింగ్ జరుగుతుండగా ఈ ఘటన కలకలం రేపింది.

మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అపజయం అంటూ ఎరుగని అనిల్ రావిపూడి.. ఆ ట్రాక్ కొనసాగిస్తూ.. సినిమా ఓ రేంజ్‌లో తీశాడని ఓవరాల్‌గా టాక్ నడుస్తోంది. థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చూస్తూ హైదరాబాద్‌లోని థియేటర్‌లో గుండెపోటుతో ఒక వ్యక్తి మరణించాడు. సోమవారం కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో ఈ సంఘటన జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం, స్క్రీనింగ్ సమయంలో ఆ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఎంత ప్రయత్నించినా చలనం లేకపోవడంతో.. థియేటర్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతను గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం తెలిసే అవకాశం ఉంది.
Also Read: తన చేపల దుకాణం క్లోజ్ చేయడంపై ఫస్ట్ టైం క్లారిటీ ఇచ్చిన కిర్రాక్ ఆర్పీ..
